మరోసారి అలరించనున్న బాషా

Monday,December 19,2016 - 11:45 by Z_CLU

సూపర్ స్టార్ కెరీర్ లోనే అల్టిమేట్ బ్లాక్ బస్టర్ బాషా. కేవలం తమిళ్ లోనే కాకుండా… ఇండియా మొత్తం హిట్ అయిన చిత్రమిది. రజనీకాంత్ స్టార్ డమ్ ను రెట్టింపు చేసిన ఈ సినిమా ఇప్పుడు మరోసారి థియేటర్లలోకి రానుంది. ఇప్పటితరం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు.. టెక్నికల్ గా మరింత రిచ్ గా తయారైంది బాషా మూవీ. 5.1 సరౌండ్ సిస్టమ్ లోకి ఈ సినిమాను మార్చి విడుదల చేస్తున్నారు. దీనికి సంబంధించి తాజాగా టీజర్ కూడా విడుదల చేశారు. టీజర్ తో మరోసారి ఎట్రాక్ట్ చేసింది తళైవ మూవీ. సత్య మూవీస్ సంస్థ 50 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా.. ఈ సినిమాను డిజిటల్ వెర్షన్ లో మార్చి రిలీజ్ చేస్తున్నారు. బాషాలోని సూపర్ హిట్ సాంగ్స్, డైలాగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్… లేటెస్ట్ సౌండ్ సిస్టమ్ లో కచ్చితంగా ప్రేక్షకుల్ని అలరిస్తాయని భావిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేస్తారు.