మరో రికార్డు సృష్టించిన శాతకర్ణి

Monday,December 19,2016 - 10:10 by Z_CLU

సోషల్ మీడియాలో గౌతమీపుత్ర శాతకర్ణి హంగామా కొనసాగుతూనే ఉంది. లైక్ లు, షేర్లు, రీట్వీట్లు.. ఇలా పేర్లు  ఎన్ని చెప్పుకున్నా శాతకర్ణి మాత్రం నెట్ లో దూసుకుపోతున్నాడు. ట్రయిలర్ ఇలా రిలీజైందో లేదో కేవలం 5 గంటల్లోనే 10లక్షల వ్యూస్ సంపాదించుకున్న గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా.. తాజాగా 20 లక్షల మార్క్ కూడా రీచ్ అయింది. విడుదలైన జస్ట్ 24 గంటల వ్యవధిలోనే ఈ ట్రయిలర్ కు 20లక్షల వ్యూస్ వచ్చాయి. రోజురోజుకు ఈ ట్రయిలర్ కు హిట్స్ పెరుగుతూనే ఉన్నాయి.

కేవలం ఆడియన్స్ కు మాత్రమే కాదు.. టాలీవుడ్ ప్రముఖులంతా గౌతమీపుత్ర శాతకర్ణిని మెచ్చుకుంటున్నారు. తక్కువ టైమ్ లో అదిరిపోయే ఔట్ పుట్ అందించిన క్రిష్ ను ప్రత్యేకంగా అభినందిస్తూనే… బాలయ్య గెటప్, డైలాగ్స్ కు పాజిటివ్ కామెంట్స్ ఇస్తున్నారు. శ్రియ హీరోయిన్ గా, హేమమాలిని ఓ కీలక పాత్రలో నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా ట్రయిలర్ ను తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి వంద థియేటర్లలో విడుదల చేసిన విషయం తెలిసిందే.