RRR తర్వాత డెబ్యూ డైరెక్టర్ తో?

Friday,July 03,2020 - 04:10 by Z_CLU

రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో తారక్ తో కలిసి ‘RRR’చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత నెక్స్ట్ సినిమా ఇంకా అనౌన్స్ చేయలేదు చరణ్. అయితే దీనికి సంబంధించి లేటెస్ట్ బజ్ ఏంటంటే.. చెర్రీ తన నెక్ట్స్ సినిమాతో ఓ కొత్త దర్శకుడికి ఛాన్స్ ఇస్తాడట.

ఇటీవలే సతీష్ అనే కుర్రాడు చరణ్ కి ఓ పాయింట్ చెప్పాడని అది మెగా పవర్ స్టార్ కి బాగా నచ్చిందని, సతీష్ ఫైనల్ స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నాడని టాక్.

రామ్ చరణ్ నెక్స్ట్ లిస్టులో త్రివిక్రమ్, కొరటాల శివ, సందీప్ రెడ్డి వంగ లాంటి పేర్లు వినబడుతున్నాయి. వీళ్ల కంటే ముందే డెబ్యూ డైరెక్టర్ తో సినిమా చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఫైనల్ స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ కు చాలా టైమ్ ఉంది.