ఆ బ్యానర్ లో అందరూ స్టార్ హీరోలే!

Friday,July 03,2020 - 03:17 by Z_CLU

టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న బడా సినిమా నిర్మాణ సంస్థల్లో ఒకటి మైత్రీ మూవీ మేకర్స్. బ్యాక్ టు బ్యాక్ బిగ్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి ఈ బ్యానర్ నుంచి. ప్రతి మూవీలో ఓ టాప్ స్టార్ ఉన్నాడు. ఆ డీటెయిల్స్ చెక్ చేద్దాం.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై పుష్ప అనే సినిమా వస్తోంది. ఇందులో బన్నీ హీరో. అల వైకుంఠపురములో లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత బన్నీ ఈ బ్యానర్ లో సినిమా చేస్తున్నాడు.

ఇదే బ్యానర్ పై సర్కారువారి పాట అనే సినిమా వస్తోంది. ఇందులో మహేష్ బాబు హీరో. సరిలేరు నీకెవ్వరు లాంటి సినిమా తర్వాత మహేష్, ఈ బ్యానర్ కు కమిట్ అయ్యాడు.

ఇవి కాకుండా.. త్వరలోనే పవన్ కల్యాణ్ తో కూాడా ఓ సినిమా చేయబోతుంది ఈ సంస్థ. ఈ ప్రాజెక్టుకు హరీష్ శంకర్ దర్శకుడు.

ఇవి కాకుండా ప్రభాస్, ఎన్టీఆర్ సినిమాలు కూడా ఈ బ్యానర్ పై రాబోతున్నాయి. ఎన్టీఆర్, కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సినిమా వచ్చేది ఈ బ్యానర్ పైనే. అటు ప్రభాస్-కొరటాల కాంబోలో కూడా ఓ సినిమా ప్లాన్ చేస్తోంది ఈ సంస్థ. ప్రభాస్ కు అడ్వాన్స్ కూడా ఇచ్చారు.

స్టార్ట్ హీరోల నెక్స్ట్ సినిమాలన్నీ మైత్రీ బ్యానర్ లో రానుండటం విశేషం.