Ramcharan - చెర్రీ లిస్ట్ లో దర్శకులు వీళ్లే!

Saturday,August 07,2021 - 02:14 by Z_CLU

శంకర్ తో రామ్ చరణ్ తన 15వ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ లో ఈ భారీ ప్రాజెక్ట్ ను మొదలు పెట్టనున్నాడు చరణ్. ఈ సినిమా తర్వాత ఇద్దరు దర్శకులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట మెగా పవర్ స్టార్. తాజాగా అనిల్ రావిపూడి చరణ్ ని కలిసి ఓ స్క్రిప్ట్ చెప్పాడని తెలుస్తుంది. అనిల్ చెప్పిన ఎంటర్టైన్ మెంట్ మిక్స్డ్ స్క్రిప్ట్ చెర్రీ కి బాగా నచ్చిందని తెలుస్తుంది.

ప్రస్తుతం వెంకటేష్ , వరుణ్ లతో F3 సినిమా చేస్తున్నాడు అనిల్. నెక్స్ట్ బాలకృష్ణ తో ఓ సినిమా చేయబోతున్నాడు. చరణ్ -శంకర్ సినిమా కంప్లీట్ అయ్యే లోపు బాలయ్య సినిమా పూర్తి చేసి ఆ తర్వాత చరణ్ సినిమా టేకప్ చేస్తాడని తెలుస్తుంది. రామ్ చరణ్ -అనిల్ రావిపూడి కాంబో సినిమాను యూ.వీ.క్రియేషన్స్ బేనర్ పై వంశీ , ప్రమోద్ నిర్మిస్తారని టాక్. ఇక రామ్ చరణ్ నెక్స్ట్ లిస్టులో ‘జెర్సీ’ దర్శకుడు గౌతం తిన్ననూరి కూడా ఉన్నాడు. ఇప్పటికే చరణ్ కోసం ఓ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడు గౌతం. ఈ కాంబో సినిమాను NV ప్రసాద్ నిర్మిస్తారని సమాచారం.

ఇలా అనిల్ రావిపూడి , గౌతం ఇద్దరితో సినిమాలు సెట్ చేసుకొని శంకర్ సినిమా తర్వాత వాటిలో ఒకటి సెట్స్ పై పెట్టె ఆలోచనలో ఉన్నాడు చరణ్. మరి ఈ ఇద్దరిలో #RC16 డైరెక్ట్ చేసే దర్శకుడెవరనేది తెలియాలంటే ఇంకొద్ది రోజులు ఆగాల్సిందే. రామ్ చరణ్ -శంకర్ కాంబో సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లోపు ఫినిష్ చేసి 2022 లోనే రిలీజ్ చేయాలని చూస్తున్నారు మేకర్స్.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics