చరణ్ మూవీస్ - సంథింగ్ స్పెషల్..

Monday,February 27,2017 - 12:14 by Z_CLU

మొన్నటివరకు మాస్ సినిమాలకే ఇంపార్టెన్స్ ఇచ్చాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. కానీ ఇప్పుడు ఈ హీరో తన స్టయిల్ మార్చాడు. ప్రయోగాలకు సై అంటున్నాడు. ధృవ సినిమాతో ఇప్పటికే ఓ డిఫరెంట్ ఎటెంప్ట్ కంప్లీట్ చేసిన చెర్రీ… ఇకపై కూడా తన కెరీర్ ను విలక్షణంగానే కొనసాగించాలని ఫిక్స్ అయ్యాడు. ఇందులో భాగంగా సుకుమార్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

సుక్కూ సినిమాలు ఎంత స్పెషల్ గా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ దర్శకుడు చెర్రీని 80ల నాటి ప్రేమకథలో చూపించాలనుకుంటున్నాడు. అది కూడాా అలాంటిలాంటి కథ కాదు. ఈ సినిమాలో చెర్రీ, చెవిటివాడుగా కనిపించబోతున్నాడనే రూమర్ ఉంది. అదే కనుక నిజమైతే చరణ్ కెరీర్ లోనే ఇదొక డిఫరెంట్ మూవీ అవుతుంది.

సుకుమార్ సినిమాతో పాటు మణిరత్నం మూవీకి కూడాా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు చరణ్. మణిరత్నం సినిమాలన్నీ వెరీ వెరీ స్పెషల్ మూవీస్. ఈ కేటగిరీలోకి రామ్ చరణ్ మూవీ కూడా చేరబోతోంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న మణిరత్నం సినిమాకు జూన్ నుంచి కాల్షీట్లు ఇచ్చాడు చరణ్. ఇది కూడా ఓ డిఫరెంట్ స్టోరీలైన్ తో తెరకెక్కనుంది. ఇలా తన అప్ కమింగ్ మూవీస్ అన్నింటినీ సంథింగ్ స్పెషల్ గా ప్లాన్ చేశాడు మెగాపవర్ స్టార్.