రామ్ చరణ్ సుక్కు సినిమా స్టోరీ లీకయింది

Monday,February 06,2017 - 08:07 by Z_CLU

రామ్ చరణ్ సుకుమార్ సినిమా అనగానే మ్యాజిక్ గ్యారంటీ అనే ట్యాగ్ పడింది. దానికి తోడు ఎంత వరకు నిజమో తెలీదు కానీ, ఈ సినిమా స్టోరీ లీకయింది అనే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతమైన హీట్ జెనెరేట్ చేస్తుంది.

లీకయింది అని ట్రెండ్ అవుతున్న స్టోరీ లైన్ ఎంతవరకు జెన్యూనో తెలీదు కానీ, నెటిజన్స్ మాత్రం ఈ స్టోరీని మరింత పాప్యులర్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న స్టోరీ ప్రకారం.. మన హీరో ఒక విలేజ్ యంగ్ స్టర్.  బేసిగ్గా చెవిటి వాడు. ఎగ్జాక్ట్ రీజన్స్ తెలీదు కానీ, ఒకసారి ఏదో పని మీద టౌన్ కి వస్తాడు. అక్కడే స్టోరీలో ట్విస్ట్ బిగిన్ అవుతుంది. ఏదో తన పని తాను చూసుకుని వెళ్ళి పోదామనుకున్న హీరోని కొంతమంది కిడ్నాప్ చేసి ల్యాబ్ లో ఉంచుతారు. అసలా ఆ కిడ్నాపర్స్ ఎవరు..? అసలే చెవిటివాడైన హీరో అక్కణ్ణించి ఎలా బయటపడతాడు..? అన్నదే మెయిన్ స్టోరీ.

Ram Charan with krish

ఈ స్టోరీ లైన్ సుకుమార్ ఎక్కడా చెప్పలేదు.. అలాగని చెర్రీ కూడా ఈ సినిమా ఇలా ఉండబోతుందన్న హింట్స్ కూడా ఇవ్వలేదు, అలాంటిది ఇప్పుడు ఈ స్టోరీ ఆన్ లైన్ లో యమ ఫాస్ట్ గా హల్ చల్ చేస్తుంది. ఈ విషయంలో ఇప్పటి వరకు సినిమా యూనిట్ అయితే ఏ రకంగా రియాక్ట్ అవ్వలేదు.