డీజే ఫస్ట్ లుక్ రెడీ

Monday,February 06,2017 - 07:02 by Z_CLU

బన్నీ లేటెస్ట్ మూవీ డీజే. హరీష్ శంకర్ డైరక్షన్ లో ఎలాంటి హంగామా లేకుండా, ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటోంది ఈ సినిమా. ఇన్నాళ్లూ బిజీ షెడ్యూల్స్ తో తీరిక లేకుండాా గడిపిన యూనిట్.. ఇక నుంచి ప్రమోషన్ పై దృష్టిపెట్టాలని అనుకుంటోంది. ఇందులో భాగంగా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసి, ఫ్యాన్స్ లో జోష్ నింపాలని ఫిక్స్ అయింది. ఈ మేరకు దర్శకుడు హరీష్ శంకర్ ట్వీట్ చేశాడు. డీజే ఫస్ట్ లుక్ రెడీ అయిందని ప్రకటించిన హరీశ్… త్వరలోనే ఫస్ట్ లుక్ లాంచ్ డేట్, టైమ్ ఎనౌన్స్ చేస్తానని ట్వీట్ చేశాడు.

దువ్వాడ జగన్నాధమ్ అనే పేరుకు షార్ట్ కట్టే డీజే. అల్లు అర్జున్ ఇందులో డిఫరెంట్ గెటప్ లో కనిపించబోతున్నాడు. ఓట్ అండ్ ఔట్ కంప్లీట్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న డీజే సినిమాలో అసలు స్టోరీలైన్ ఏంటనే విషయాన్ని సీక్రెట్ గా ఉంచుతున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు. గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకరర్-దేవిశ్రీ కాంబోలో వస్తున్న సినిమా ఇదే. అటు బన్నీ-పూజా హెగ్డే కాంబో కూడాా ఫ్రెష్ జోడీగా పేరుతెచ్చుకుంది.