జీ సినిమాలు ఫిబ్రవరి ( 7th)

Monday,February 06,2017 - 10:00 by Z_CLU

chilipi-krishnudu-telugu-movie

నటీనటులు  – అక్కినేని, వాణిశ్రీ

ఇతర నటీనటులు – సత్యనారాయణ, గుమ్మడి, రావుగోపాల్రావు, ప్రభాకరరెడ్డి

మ్యూజిక్ డైరెక్టర్  – కేవీ మహదేవన్

ప్రొడ్యూసర్  – డి.రామానాయుడు

డైరెక్టర్  – బోయిన సుబ్బారావు

రిలీజ్ డేట్ – 1978, జనవరి 11

లెజెండ్ అక్కినేని, మూవీ మొఘల్ రామానాయుడు కాంబినేషన్ లో వచ్చిన మరో హిట్ చిత్రం చిలిపి కృష్ణుడు. అప్పటికే పలు సీరియస్ సినిమాలు చేసిన ఈ సూపర్ హిట్ ద్వయం… ఈసారి కాస్త ఫన్నీగా ఉండే కుటుంబకథను ఎంచుకోవాలని ఫిక్స్ అయింది. అలా బోయిన సుబ్బారావు దర్శకత్వంలో పుట్టుకొచ్చిన సినిమానే చిలిపి కృష్ణుడు. ఆచార్య ఆత్రేయ డైలాగులు, కేవీ మహదేవన్ సంగీతం ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్స్. అప్పటికే సూపర్ హిట్ జోడీగా పేరుతెచ్చుకున్న అక్కినేని,వాణిశ్రీ ఈ సినిమాతో రికార్డు వసూళ్లు సాధించారు.

========================================================================

 pellikoduku-zee-cinemalu

నటీనటులు : నరేష్, దివ్యవాణి

ఇతర నటీనటులు : బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, సంగీత, A.V.S. సుబ్రహ్మణ్యం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, బాబు మోహన్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : కీరవాణి

డైరెక్టర్ : బాపు

ప్రొడ్యూసర్ : ముళ్ళపూడి వెంకట రమణ

రిలీజ్ డేట్ : 1994

బాపు గారి డైరెక్షన్ లో తెరకెక్కిన అద్భుత దృశ్య కావ్యం పెళ్ళి కొడుకు. మనసుకు నచ్చిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనే ధృడ నిశ్చయంతో ఇంట్లోంచి బయటికి వచ్చిన యువకుడి కథే పెళ్ళికొడుకు. ఆ తరవాత ఏం జరిగింది..? తను కోరుకున్న అమ్మాయితో పెళ్లి జరిగిందా లేదా అన్నదే ప్రధాన కథాంశం.

============================================================================

 bava

 

 

నటీనటులు : సిద్ధార్థ, ప్రణీత

ఇతర నటీనటులు : రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, నాజర్, సింధు తులాని

మ్యూజిక్ డైరెక్టర్ : చక్రి

డైరెక్టర్ : రామ్ బాబు

ప్రొడ్యూసర్ : పద్మ కుమార్ చౌదరి

రిలీజ్ డేట్ : 29 డిసెంబర్ 2010

అందమైన పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కిందే బావ. ఈ సినిమాలో సిద్ధార్థ, ప్రణీత హీరో హీరోయిన్లుగా నటించారు. రాజేంద్ర ప్రసాద్ సిద్ధార్థ తండ్రి సీతారామ్ గా నటించాడు. నిజానికి అసలు కథ సీతారామ్ దగ్గరి నుండే మొదలవుతుంది. ప్రేమించి పెళ్ళి చేసుకున్న తను తన భార్య కుటుంబం నుండి తనను దూరం చేశాననే గిల్ట్ ఫీలిగ్ తో తను చేసిన తప్పు తన కొడుకు చేయకూడదు అనుకుంటూ ఉంటాడు. అంతలో వీరబాబు(సిద్ధార్థ) ఒక అమ్మాయి ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయి తన భార్య అన్న అకూతురు అని తెలుసుకున్న సీతారామ్, వీరబాబుతో తన ప్రేమను మర్చిపొమ్మంటాడు. అప్పుడు వీరబాబు ఏం చేస్తాడు..? కథ ఏ మలుపు తిరుగుతుందన్న అంశాలు ZEE Cinemalu లో చూడాల్సిందే.

==============================================================================

 police-adhikari

నటీ నటులు : నాగబాబు, అంకిత

ఇతర నటీనటులు : భూషణ్, సూర్య తేజ, ధీరజ్, రఘునాథ్ రెడ్డి

మ్యూజిక్ డైరెక్టర్ : అర్జున్ శర్మ

డైరెక్టర్ : రాము

ప్రొడ్యూసర్ : భరత్ కుమార్

రిలీజ్ డేట్ : 9 జనవరి 2009

నాగబాబు పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా నటించిన చిత్రం పోలీస్ అధికారి. అంకిత ఈ సినిమాలో హీరోయుయిన్ గా చేసింది. రాము డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకి అర్జున్ శర్మ సంగీతం అందించాడు.

======================================================================

  seenugadu-love-story

నటీనటులు – ఉదయనిథి స్టాలిన్, నయనతార

మ్యూజిక్ డైరెక్టర్ – హరీష్ జైరాజ్

డైరెక్టర్ – ఎస్.ఆర్ ప్రభాకరన్

రిలీజ్ డేట్ – 2015

అప్పటికే ఓకే ఓకే సినిమాతో తెలుగులో కూడా పెద్ద హిట్ అందుకున్నాడు ఉదయ్ నిధి స్టాలిన్. ఆ ఉత్సాహంతో 2014లో విడుదలైన తన తమిళ సినిమాను… శీనుగాడి లవ్ స్టోరీ పేరుతో తెలుగులోకి కూడా డబ్ చేసి రిలీజ్ చేశాడు. నయనతార హీరోయిన్ గా నటించడంతో ఈ సినిమాకు తెలుగులో కూడా రీచ్ పెరిగింది. పైగా తెలుగులో ఓకేఓకే హిట్ అవ్వడంతో.. శీనుగాడి లవ్ స్టోరీకి కూడా క్రేజ్ ఏర్పడింది. ప్రభాకరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు హరీష్ జైరాజ్ సంగీతం అందించాడు. ఈ సినిమాకు కూడా ఎప్పట్లానే తానే నిర్మాతగా వ్యవహరించాడు ఉదయ్ నిథి స్టాలిన్.

=========================================================================

oh-my-friend

నటీనటులు  – సిద్దార్థ్, శృతిహాసన్

ఇతర నటీనటులు – నవదీప్, హన్సిక,

మ్యూజిక్ డైరెక్టర్ – రాహుల్ రాజ్

నిర్మాత – దిల్ రాజు

దర్శకత్వం – వేణుశ్రీరాం

రిలీజ్ డేట్  – 2011, నవంబర్ 11

స్నేహానికి  సరికొత్త అర్థాన్నిస్తూ తెరకెక్కిన ఓ మై ఫ్రెండ్ సినిమాకు చాలా విశేషాలున్నాయి. తెలుగులో  శృతిహాసన్ కు ఇది రెండో సినిమా. అయితే శృతిహాసన్ కంటే ముందే  ఆ క్యారెక్టర్ కోసం సమంతను అనుకున్నారు. అప్పటికే ఏమాయచేశావెతో సక్సెస్ అందుకున్న సమంతను హీరోయిన్ గా తీసుకోవాలని దిల్ రాజు కూడా అనుకున్నాడు. ఆ తర్వాత అమలాపాల్, నిత్యామీనన్ లాంటి హీరోయిన్లపై కూడా ఫొటోషూట్ చేశారు. ఫైనల్ గా హీరో సిద్ధార్థ్ పట్టుబట్టి మరీ శృతిహాసన్ ను తీసుకున్నాడు. ఈ సినిమాతోనే వేణుశ్రీరామ్ దర్శకుడిగా పరిచయం కాగా.. ఇదే మూవీతో మలయాళం ఇండస్ట్రీకి చెందిన రాహుల్ రాజ్ సంగీత దర్శకుడిగా కూడా పరిచయం అయ్యాడు. ఆన్ లైన్ లో పైరసీ జరగకుండా నిరోధించే అత్యాధునిక టెక్నాలజీ ఈ సినిమాతోనే టాలీవుడ్ కు పరిచయమైంది.

=========================================================================

 posani-gentle-man-zee-cinemalu

నటీనటులు : పోసాని కృష్ణమురళి, ఆర్తి అగర్వాల్

ఇతర నటీనటులు : బ్రహ్మానందం, నాగబాబు, M.S. నారాయణ, ఆలీ, సుధ, సురేఖా వాణి తదితరులు

డైరెక్టర్ : పోసాని కృష్ణ మురళి

ప్రొడ్యూసర్ : నల్లం పద్మజ

రిలీజ్ డేట్ : 2009

పోసాని కృష్ణమురళి డైరెక్షన్ లో వచ్చిన డిఫెరెంట్ సినిమా పోసాని జెంటిల్ మెన్. తన భర్త జెంటిల్ మెన్ అని నమ్మే భార్య, తన భర్త నిజాయితీని తెలసుకునే ప్రయత్నం చేస్తుంది. ఆ తరవాత ఏం జరిగింది అనేదే ప్రధాన కథాంశం.