సూపర్ ప్లాన్ తో ......

Sunday,December 11,2016 - 11:30 by Z_CLU

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పర్ఫెక్ట్ ప్లానింగ్ తో సినిమాలు ప్లాన్ చేస్తు న్నాడు. లేటెస్ట్ గా ‘ధృవ’ సినిమాతో థియేటర్స్ లో సందడి చేస్తున్న చెర్రీ త్వరలోనే సుకుమార్ డైరెక్షన్ లో నటించడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను జనవరి నుండి సెట్స్ పై పెట్టి వీలైనంత త్వరగా ఫినిష్ చెయ్యాలని డిసైడ్ అయ్యాడు చెర్రీ.

సుకుమార్ సినిమాకి ఇలా ప్యాకప్ చెప్తాడో లేదో,  కొరటాల శివ తో సినిమాను సెట్స్ పై పెట్టబోతున్నాడు మెగా పవర్ స్టార్. గతంలో కొరటాల శివతో ఓ సినిమా ప్లాన్ చేసిన చెర్రీ అప్పుడు వర్కౌట్ కాక పోవడం తో నెక్స్ట్ ఇయర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో  ఈ సినిమాను సెట్స్ పై పెట్టేందుకు రెడీ అవుతున్నాడు. ఈ రెండు సినిమాలతో  పాటు మణిరత్నం తో కూడా ఓ లవ్ ఎంటర్టైనర్ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాను కూడా వీలైనంత త్వరగా స్టార్ట్ చేయాలని చూస్తున్నాడు చెర్రీ. రామ్ చరణ్ డైరెక్టర్స్ సెలెక్షన్స్ చూస్తుంటే, డిఫెరెంట్ జోనర్స్ కరియర్ ప్లాన్ చేసుకుంటున్నాడని క్లియర్ గా అర్థమవుతుంది.