హీరోలకు కలిసొస్తున్న బన్నీ ....

Sunday,December 11,2016 - 10:00 by Z_CLU

ప్రెజెంట్ టాలీవుడ్ లో వరుస హిట్స్ తో పాటు భారీ కలెక్షన్స్  సాధిస్తూ ఇతర భాషల్లోనూ స్టార్ ఇమేజ్ తో దూసుకుపోతున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ టాలీవుడ్ హీరోలకు లక్కీ హీరోగా మారుతున్నాడు. ఇదేంటి బన్నీ టాలీవుడ్ స్టార్స్ కు లక్కీ గా మారడం ఏంటి? అదెలా? అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ పై ఓ లుక్ వేయండి.

ఇక విషయం లోకెళితే స్టైలిష్ స్టార్ బన్నీ ఓ సినిమా ఫంక్షన్ కి ఎటెండ్ అయితే చాలు ఆ సినిమా సూపర్ హిట్ సాధించడం పక్కా. ఈ లక్కీ సెంటిమెంట్ చాలా ఏళ్లుగా చాలా మంది హీరోలకు కలిసొచ్చింది కూడా. ఆ మధ్య ప్రభాస్ నటించిన ‘డార్లింగ్’ సినిమా నుండి లేటెస్ట్ గా రిలీజ్ అయిన ‘కుమారి 21’ సినిమా వరకూ ఈ సెంటిమెంట్ ఆ హీరోలకు బాగానే కలిసొచ్చింది.

kumari-21-f-audio-launch-photos-16

ఇక ఇతర హీరోలతో పాటు మెగా హీరోలకు కూడా బన్నీలక్కీ హీరోగా ప్రూవ్ అయ్యాడు. ఈ విషయాన్ని కొన్ని  మెగా సినిమాలు రుజువు చేశాయి కూడా.

బన్నీ గతంలో గెస్ట్ గా ఎటెండ్ అయిన ‘100% లవ్’,’ఈరోజుల్లో’, ‘భలే భలే మగాడివోయ్’ వంటి సినిమాలు సూపర్ హిట్స్ అందుకోవడంతో లేటెస్ట్ గా బన్నీ  సెంటిమెంట్ తో తను కూడా మరో హిట్ అందుకోవాలని చూస్తున్నాడు శర్వానంద్.

శర్వానంద్ హీరో గా తెరకెక్కుతున్న ‘శతమానం భవతి’ సినిమా ఆడియో రిలీజ్ కి  స్టార్ గెస్ట్ గా అవ్వబోతున్నా డు బన్నీ. ఈ సినిమాతో పాటు, ఇప్పుడు తను చేస్తున్న ‘D.J.’ కి ప్రొడ్యూసర్ కూడా దిల్ రాజు కావడంతో ఈ  ఆడియో ఫంక్షన్ కి వస్తానని గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసినట్లు సమాచారం. ఏదేమైనా బన్నీ టాలీవుడ్ హీరోలకు లక్కీ హీరో గా కలిసొస్తున్నాడు.