చెర్రీ పూర్తి చేసేశాడు...

Monday,October 24,2016 - 10:50 by Z_CLU

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌ సురేందర్ రెడ్డి దర్శకత్వం లో నటిస్తున్న తాజా చిత్రం ‘ధృవ’. గీతాఆర్ట్స్ బ్యాన‌ర్ లో అల్లు అర‌వింద్‌, మ‌రో నిర్మాత ఎన్‌.వి.ప్ర‌సాద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా కు సంబంధించిన టాకీ పార్ట్ చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. న‌వంబ‌ర్ మొద‌టివారంలో హీరో ఇంట్ర‌డ‌క్ష‌న్ సాంగ్ పూర్తి చేయనున్నారు.

dhruva-3

       ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు  శ‌ర‌వేగంగా జరుగుతున్నాయి. రామ్‌చ‌ర‌ణ్ ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో కనిపించనున్న ఈ చిత్ర టీజర్ సినిమా పై భారీ అంచనాలను పెంచేసింది. . నవంబర్ లో ఆడియో విడుదల చేసి సినిమాను డిసెంబ‌ర్‌లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రావ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు మేకర్స్.  తాజా సమాచారం ప్రకారం డిసెంబర్ మొదటి వారం లో విడుదల కానుంది.