అభిమానులకు విజ్ఞప్తి...

Monday,October 24,2016 - 11:48 by Z_CLU

నవంబర్ 7 వస్తుందంటే చాలు ఓ వారం ముందు నుంచే కమల్ హాసన్ అభిమానులు చెన్నైలోపుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. కానీ ఈ సారి మాత్రం అలాంటి వేడుకలు జరపొద్దని విజ్ఞప్తి చేశారు కమల్.

      ఇటీవలే కమల్ తన ఆఫీస్ లో కిందపడి గాయాలపాలై… ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఆయన అనారోగ్యం పాలవ్వడం తో పాటు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం కూడా బాగోకపోవడంతో ఈ ఏడాది తన పుట్టిన రోజు వేడుకలను జరపొద్దని తన అభిమానులకు సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు కమల్. ముఖ్యమంత్రి జయలలిత పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించిన కమల్… నవంబర్ నుండి ‘శభాష్ నాయుడు’ షూటింగ్ ను తిరిగి ప్రారంభించే ఆలోచనలో ఉన్నారు.