సరికొత్త లుక్ లో ఎనర్జిటిక్ స్టార్ రామ్

Tuesday,November 13,2018 - 10:03 by Z_CLU

ప్రస్తుతం బ్రేక్ మోడ్ లో ఉన్నాడు రామ్. రీసెంట్ గా ‘హలో గురూ ప్రేమ కోసమే’ తో ఎంటర్ టైన్ చేసిన ఈ హీరో, ఇంకా తన నెక్స్ట్ సినిమాను సెట్స్ పైకి తీసుకురాలేదు కానీ, సరికొత్త లుక్స్ తో ఉన్న స్టిల్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాంతో సడెన్ గా ఫ్యాన్స్ ఫోకస్ రామ్ నెక్స్ట్ సినిమాపై పడింది.

ఈ మధ్య పూరి డైరెక్షన్ లో రామ్ నటిస్తున్నాడనే న్యూస్ గట్టిగానే నడిచింది. రామ్ కూడా డిస్కర్షన్స్ నడుస్తున్నాయనే క్లారిటీ ఇచ్చాడు కానీ ఆ తరవాత ఈ సినిమా గురించి పెద్దగా అప్ డేట్ రాలేదు. అయితే రామ్ కొత్త మేకోవర్ ఈ సినిమా కోసమేనా..? అంటే ఆల్మోస్ట్ పూరి, రామ్ కాంబో ఫిక్సయినట్టేనా..? అనే క్వశ్చన్స్ సోషల్ మీడియాలో రేజ్ అవుతున్నాయి.

గతంలో ‘ఉన్నది ఒకటే జిందగీ’ కోసం సినిమా కోసం సరికొత్త లుక్స్ లో మెస్మరైజ్ చేశాడు ఈ ఎనర్జిటిక్ స్టార్ . ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఈ కొత్త లుక్స్ సంగతి తేలాలంటే, ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.