రంగస్థలం సెకెండ్ సాంగ్ డీటెయిల్స్

Thursday,March 01,2018 - 11:30 by Z_CLU

రంగస్థలం సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన సాంగ్ సూపర్ హిట్ అయింది. ఏకంగా కోటి వ్యూస్ కొల్లగొట్టింది. ఇప్పుడు ఆ ఉత్సాహంతో సెకెండ్ సింగిల్ రిలీజ్ చేయబోతున్నారు. అది కూడా మోస్ట్ ఎవెయిటింగ్ టైటిల్ సాంగ్. అవును.. రేపు సాయంత్రం 6 గంటలకు రంగస్థలం రెండో లిరికల్ వీడియో రిలీజ్ అవుతుంది.

మొదటి సింగిల్ ను సూపర్ హిట్ చేసినందుకు థ్యాంక్స్ చెబుతూనే.. ఆ పాటను అతిలోకసుందరి శ్రీదేవికి అంకితమిచ్చారు. పనిలోపనిగా రెండో సింగిల్ వివరాల్ని వెల్లడించాడు మ్యూజిక్ డైరక్టర్ దేవిశ్రీప్రసాద్. కంప్లీట్ ఫోక్ స్టయిల్ లో, ఫాస్ట్ బీట్ లో రంగస్థలం టైటిల్ సాంగ్ సాగుతుందనే విషయాన్ని తనదైన స్టయిల్ లో రివీల్ చేశాడు. ఈ కింద వీడియో అదే.

చెర్రీ-సమంత హీరోహీరోయిన్లుగా నటిస్తున్న రంగస్థలం సినిమా మార్చి 30న విడుదల కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు సుకుమార్ దర్శకుడు.