రామ్ చరణ్ ‘రంగస్థలం’ జ్యూక్ బాక్స్ రివ్యూ

Thursday,March 15,2018 - 12:34 by Z_CLU

ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ అవేటెడ్ మూవీ రంగస్థలం. మార్చి 30న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ఈ సినిమా చుట్టూ నెక్ట్స్ లెవెల్ ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ అయి ఉన్నాయి. 1985 బ్యాక్ డ్రాప్ లో సినిమాని తెరకెక్కిస్తున్న సుకుమార్, సాంగ్స్ విషయంలో అదే తరహా కేర్ తీసుకున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ ఏ మాత్రం 80’s ఫ్లేవర్ మిస్ కాకుండా జాగ్రత్త పడుతూనే ట్రెండీ కంపోజిషన్స్ తో అదరగొట్టేశాడు.

ఇప్పటికే 3 సాంగ్స్ రిలీజ్ చేసి, సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఫిల్మ్ మేకర్స్ మిగతా 2 సాంగ్స్ తో కలిపి జ్యూక్ బాక్స్ రిలీజ్ చేస్తారు. ఆ ఆడియో రివ్యూ మీకోసం…

 

 

ఎంత సక్కగున్నావే లచ్చిమి : ‘రంగస్థలం’ జ్యూక్ బాక్స్ లో మోస్ట్ ఎట్రాక్టివ్ సాంగ్. ఇప్పటికే ఈ సాంగ్ యూ ట్యూబ్  లో 16  మిలియన్ వ్యూస్ ని రికార్డ్ చేసుకుంది.   చంద్రబోస్ లిరిక్స్ రాసిన ఈ పాటను దేవి శ్రీ ప్రసాద్ పాడాడు. సినిమాలో హీరోయిన్ ని పొగుడుతూ పల్లె యాసలో సాగే ఈ సాంగ్, స్క్రీన్ పై ఎప్పుడెప్పుడు చూస్తామా అనే రేంజ్ లో క్యూరాసిటీ క్రియేట్ చేసింది.

రంగ రంగ రంగస్థలాన :  ఈ సాంగ్ సినిమాలో ఏ సిచ్యువేషన్ లో వస్తుందో గెస్ చేయడం అనవసరం కానీ, ఈ సినిమా టైటిల్ ప్రస్తావన వచ్చినప్పుడు ‘ప్రతి గ్రామం రంగస్థలమే… అందులో మనుషులు తోలు బొమ్మల్లాంటి వాళ్ళు’ అని సుకుమార్ చెప్పినట్టు ఈ సాంగ్, సినిమా థీమ్ ని ఎలివేట్ చేస్తుంది. ఈ సాంగ్ రిలీజ్ అయిన మూమెంట్ నుండే మాస్ లో మరింత పాజిటివ్ వైబ్ ని క్రియేట్ చేసింది.

రంగమ్మ మంగమ్మ : ఈ సినిమాలో సమంతా లుక్స్ రిలీజ్ అయినప్పుడు ఏ రేంజ్ లో అప్రీసియేషన్ దక్కిందో, ఈ పాటకు కూడా అంతే ప్రశంసలు దక్కాయి. సినిమాలో హీరోయిన్ హీరోపై ఉన్న ప్రేమను ఎక్స్ ప్రెస్ చేస్తూనే, తన చుట్టూ ఉన్న ఆడవాళ్ళకు తన గోడు చెప్పుకున్నట్టుగా ఉండే ఈ సాంగ్ ని M.M. మానసి పాడింది. చంద్రబోస్ లిరిక్స్ రాశాడు.

 

ఆ గట్టునుంటావా : సాంగ్ లిరిక్ ని బట్టి సినిమాలోని టర్నింగ్ పాయింట్ స్టేజ్ లో ఉండే సాంగ్. సినిమాలోని ఎగ్జాక్ట్ సిచ్యువేషన్ గెస్ చేయడం కష్టమే కానే, ఊళ్ళో వాళ్ళలో అవేర్ నెస్ తీసుకొచ్చే క్రమంలో ఈ సాంగ్ ఉండబోతుందని తెలుస్తుంది. మాస్ బీట్ తో కంపోజ్ అయిన ఈ సాంగ్ ని శివ నాగులు పాడాడు. చంద్రబోస్ లిరిక్స్ రాశాడు.

జిగేల్ రాణి :  సినిమాలో స్పెషల్ సాంగ్. ఈ సాంగ్ లో చెర్రీ తో పూజా హెగ్డే స్టెప్పులు వేసింది. రేలా కుమార్, ఘంటా వెంకట లక్ష్మి కలిసి పాడిన ఈ సాంగ్, సమ్ థింగ్ స్పెషల్ అనిపించుకుంటుంది. చంద్రబోస్ లిరిక్స్ రాశాడు.

ఓవరాల్ గా రంగస్థలంలో ప్రతి పాట 80ల నాటి ఫ్లేవర్ ను మనకు చూపిస్తుంది. మరీ ముఖ్యంగా ప్రతి పాట తనదైన యునిక్ స్టయిల్ లో ఉంది. దేన్నీ తక్కువ చేసి చూడలేం.