‘నా పేరు సూర్య’లో హైలెట్ ఫైట్

Thursday,March 01,2018 - 10:02 by Z_CLU

అల్లు అర్జున్ నటిస్తున్న మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ నా పేరు సూర్య. కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో 4 హెవీ యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి. వీటిలో ఒకటి వెరీ వెరీ స్పెషల్ అని తెలుస్తోంది. ఇంటర్వెల్ బ్యాంగ్ లో వచ్చే ఈ ఫైట్.. టోటల్ సినిమాకే హైలెట్ అంటోంది టీం.

నా పేరు సూర్య సినిమాలో ఓ సొరంగం ఫైట్ ఉంది. దీని కోసం అన్నపూర్ణ స్టుడియోస్ లో భారీ టన్నెల్ సెట్ నిర్మించారు. ఇందులోనే హాలీవుడ్ స్టయిల్ లో బన్నీపై ఓ యాక్షన్ బ్లాక్ తీశారు. మూవీ ఇంటర్వెల్ టైమ్ లో వచ్చే ఈ ఫైట్ టోటల్ సినిమాకే హైలెట్ అంటున్నారు.

ఈ యాక్షన్ బ్లాక్ తో పాటు సినిమాలో వచ్చే మరో 3 యాక్షన్ ఎపిసోడ్స్ వేటికవే భిన్నంగా ఉంటాయట. పీటర్ హెయిన్స్ ఈ సినిమాకు యాక్షన్ కొరియోగ్రఫీ అందిస్తున్నాడు. వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ బన్నీ నటిస్తున్న ఈ సినిమా మే 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలకానుంది.