విజయ్ దేవరకొండ ‘ఏ మంత్రం వేశావే’ ట్రైలర్ రిలీజయింది

Thursday,March 01,2018 - 12:12 by Z_CLU

అర్జున్ రెడ్డి లాంటి సెన్సేషనల్ హిట్ తరవాత వస్తున్న విజయ్ దేవరకొండ సినిమా ‘ఏ మంత్రం వేశావే’. రొమాంటిక్ థ్రిల్లర్ లా తెరకెక్కిన ఈ సినిమా మార్చి 9 న రిలీజవుతుంది. అయితే ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ స్పీడ్ పెంచిన సినిమా యూనిట్ ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది.

లైఫ్ లో గేమింగ్ కి తప్ప మరే ఇమోషన్ కి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వని యువకుడిలా కనిపించనున్నాడు విజయ్ దేవరకొండ ఈ సినిమాలో. ట్రైలర్ ని బట్టి మోస్ట్ ఇంటెన్సివ్ ఇమోషనల్ థ్రిల్లర్ అని తెలుస్తుంది. సిటీలో ఒక అమ్మాయి గురించి తెలుసుకోవడం గేమింగ్ చాలెంజ్ లా ఆక్సెప్ట్ చేసిన హీరో, ఆ అమ్మాయితో లవ్ లో పడటం, తను డేంజర్ లో ఉందని తెలుసుకుని తనను కాపాడుకోవడానికి రిస్క్ తీసుకోవడం లాంటి ఎలిమెంట్స్ తో తెరకెక్కింది ఏ మంత్రం వేశావే.

శ్రీధర్ మర్రి స్వయంగా నిర్మించి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శివానీ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. అబ్బత్ సమత్ మ్యూజిక్ కంపోజర్. మాల్కాపురం శివ కుమార్ ఈ సినిమాని సమర్పిస్తున్నారు.