నవంబర్ నుండి సుకుమార్ తో ?

Monday,August 22,2016 - 02:34 by Z_CLU

 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సురేందర్ రెడ్డి దర్శకత్వం లో నటిస్తున్న తాజా చిత్రం ‘ధ్రువ’ . ప్రస్తుతం చిత్రీకరణ లో ఉన్న ఈ సినిమాను విజయ దశమి కానుకగా విడుదల చేయనున్నారు నిర్మాత అల్లు అరవింద్. ఈ సినిమా తరువాత చరణ్ సుకుమార్ తో సినిమాకు సిద్దమవుతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన కథ ను సుకుమార్ తాజా గా సిద్ధం చేసినట్లు ఫిలిం నగర్ టాక్. ఇటీవలే ‘నాన్నకు ప్రేమతో’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సుకుమార్ తనదైన స్టైలిష్ మేకింగ్ తో ఈ సినిమాను రూపొందించ నున్నాడట. ఈ చిత్రం లో చరణ్ లుక్ తో పాటు సన్నివేశాలు కూడా సరి కొత్తగా ఉంటాయని అంటున్నారు చిత్ర యూనిట్. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ సినిమాకు మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్ కాగా దేవి శ్రీ సంగీతం అందించనున్నారు. నవంబర్ నుండి ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం.