ఘనంగా ప్లాన్ చేస్తున్న రామ్ చరణ్

Monday,August 22,2016 - 03:43 by Z_CLU

 

మెగా స్టార్ చిరంజీవి జన్మదిన వేడుక ఈ రోజు సాయంత్రం శిల్పకళా వేదిక లో ఘనంగా జరగనుంది. ఈ వేడుకకు ముఖ్య అతిధి గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరుకానున్నట్లు సమాచారం. ఈ వేడుకకు ఖచ్చితంగా హాజరు కావాల్సింది గా పవన్ ను చరణ్ ఆహ్వానించినట్లు సమాచారం. ఈ వేడుకకు భారీ స్థాయిలో మెగా ఫాన్స్ హాజరుకానుండడంతో అభిమానుల అలరించడం కోసం చాలా ఏర్పాట్లు చేసాడట చెర్రీ. ఈ వేడుకలో మెగాస్టార్ పాటలకు రకుల్, రాశి కన్నా మొదలగు నాయికలు స్టెప్స్ వేయనున్నారట. మెగా హీరోలందరూ పాల్గొనే ఈ కార్యక్రమం లో మెగా స్టార్ 150 చిత్రం ‘ఖైదీ నెం 150’ సినిమాకు సంబంధించిన టీజర్ తో పాటు రామ్ చరణ్ ధ్రువ టీజర్ ను కూడా విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేశారట మెగా టీం. ఈ వేడుకకు మెగా హీరోలతో పాటు టాలీవుడ్ యంగ్ హీరో లు కూడా హాజరు కానున్నట్లు సమాచారం.