మెగా స్టార్ కి జన్మదిన శుభాకాంక్షలు

Monday,August 22,2016 - 11:00 by Z_CLU

మెగా స్టార్ చిరంజీవి…. ఈ పేరు కు పరిచయం అక్కర్లేదు. ‘పునాది రాళ్లు’ చిత్రంతో టాలీవుడ్ లో నటుడిగా పునాది వేసుకొని ఆ తరువాత వరుస సూపర్ డూపర్ హిట్స్ తో విజేత గా మారి ప్రేక్షకుల హృదయాల్లో ఖైదీ గా ముద్ర వేసుకొని గ్యాంగ్ లీడర్ బిరుదు తో ముఠా మేస్త్రి అనిపించుకోవడం ఒక్క చిరంజీవి కే సొంతం.. టాలీవుడ్ సినిమాకు తన డాన్సులతో నటనతో చిరు మరింత కళ తీసుకొచ్చాడు. స్టార్టింగ్ లో విలన్ గా అలరించిన కొణిదెల శివ శంకర వర ప్రసాద్ అంచెలంచెలుగా అగ్ర కథానాయకుడిగా ఎదిగి తెలుగు ప్రేక్షకులతో మెగా స్టార్ అని పిలిపించుకున్నాడు. ఇక తొలిసారి కోటి రూపాయల పారితోషికం అందుకొని సంచలనం సృష్టించాడు మెగా స్టార్. ఎనలేని అభిమానులతో పాటు తిరుగులేని రికార్డులు కూడా చిరు సొంతం. చిరు చిత్రం వస్తుందంటే చాలు ఆ రోజు మెగాభిమానులతో పాటు ప్రేక్షకులకూ పండగే. దాదాపు 8 ఏళ్ళ విరామం తరువాత మళ్ళీ ‘ఖైదీ నంబర్ 150’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మెగా స్టార్ చిరంజీవి కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది జీ సినిమాలు.