రకుల్ కు కరోనా తగ్గిపోయింది

Tuesday,December 29,2020 - 06:20 by Z_CLU

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కొన్ని రోజుల కిందట కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడామె కరోనా నుంచి పూర్తిగా కోలుకుంది. తాజాగా నిర్వహించిన పరీక్షలో ఆమెకు కరోనా నెగెటివ్ వచ్చింది. ఈ విషయాన్ని రకుల్ స్వయంగా వెల్లడించింది.

“నాకు పరీక్షల్లో కరోనా నెగెటివ్ వచ్చింది. చాలా ఆనందంగా ఉంది. నేను చాలా బాగున్నాను. మీ అందరు కురిపిస్తున్న ప్రేమకు థ్యాంక్స్. 2021ను పూర్తి ఆరోగ్యంతో, పాజిటివ్ దృక్పథంతో ప్రారంభించడానికి ఉత్సాహంగా ఉన్నాను.”

ఇలా తనకు కరోనా తగ్గిన విషయాన్ని బయటపెట్టింది రకుల్. దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ.. బాధ్యతగా ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలని, అన్ని ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తోంది ఈ చిన్నది.

త్వరలోనే బాలీవుడ్ మూ మే-డే సెట్స్ లో జాయిన్ అవ్వబోతోంది రకుల్. అజయ్ దేవగన్, అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.