Rakul Preeth - వెబ్ మూవీ పూర్తిచేసిన హీరోయిన్

Friday,July 02,2021 - 11:31 by Z_CLU

హీరోయిన్ గా ఫుల్ బిజీగా ఉన్న రకుల్ ఓ వెబ్ ఫిలిం చేస్తుంది. OTT కోసం తమిళ దర్శకుడు AL విజయ్ రూపొందిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటివలే పూర్తయింది. చెన్నై లో కొన్ని రోజులు షూట్ చేసిన యూనిట్ తాజాగా హైదరాబాద్ గండిపేట్ లో కొన్ని కీలక సన్నివేశాలు తీశారు. నిన్నటి వరకు షూట్ జరిగింది. రకుల్ ప్రీత్ సింగ్ , విశ్వక్ సేన్ లపై సీన్స్ తీశారు. విశ్వక్ సేన్ ఇందులో అతిథి పాత్ర చేస్తున్నాడు. విద్యులేక రామన్ తో ఇంకా కొందరు నటీ నటులు ఇందులో నటిస్తున్నారు.

rakul preet new stills zeecinemalu

                  రకుల్ ప్రీత్

హాలోవెన్ నేపథ్యంలో హారర్ ఎలిమెంట్స్ తో ఆసక్తి కరంగా సాగే ఈ వెబ్ మూవీకి ‘అక్టోబర్ 31st లేడీస్ నైట్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇందులో రకుల్ పాత్ర చుట్టూనే కథ నడుస్తుంది. నాలుగైదు కథలను ఓకె కథగా చేర్చి ఈ OTT సినిమాను తెరకెక్కిస్తున్నాడట విజయ్. ఇప్పటికే ఓటిటి సంస్థతో ఒప్పందం అయిపొయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ వెబ్ మూవీ రిలీజ్ డేట్ తో పాటు ఎందులో రిలీజ్ అయ్యేది త్వరలోనే ప్రకటించనున్నారు.

దిల్ రాజు బేనర్ ద్వారా ఈ వెబ్ మూవీ రిలీజ్ కానుందని సమాచారం. ఇక ఇటివలే సమంత నటించిన వెబ్ సిరీస్ ‘ఫ్యామిలీ మెన్’ మంచి సక్సెస్ అయ్యింది. మరి అదే బాటలో వెళ్తున్న రకుల్ ఈ వెబ్ మూవీతో ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics