పుకార్లు ఖండించిన రకుల్

Sunday,June 28,2020 - 12:08 by Z_CLU

ఇటు హైదరాబాద్, అటు చెన్నైలో కరోనా వైరస్ రోజురోజుకు వ్యాపిస్తోంది. దీంతో హీరోలంతా తమ సినిమాల షూటింగ్స్ ను వాయిదా వేసుకుంటున్నారు. ఒకవేళ ఎవరైనా ముందుకొచ్చినప్పటికీ, హీరోయిన్లు సెట్స్ పైకి రావడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఈ క్రమంలో రకుల్ కూడా ఓ తమిళ నిర్మాతకు హ్యాండ్ ఇచ్చినట్టు గాసిప్స్ వచ్చాయి

తనపై వచ్చిన రూమర్స్ పై రకుల్ సీరియస్ గా రియాక్ట్ అయింది. తన గురించి రాసేటప్పుడు నిజాలు చెక్ చేసుకోవాలని సూచించిన ఈ బ్యూటీ.. అసలు చెన్నైలో షూటింగ్స్ ఎక్కడ జరుగుతున్నాయో చెప్పాలని అంటోంది. ఒకవేళ షూటింగ్ స్టార్ట్ అయితే అందులో పాల్గొనడానికి తను చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని క్లారిటీ ఇచ్చింది.

ఇలా తనపై వచ్చిన రూమర్లకు చెక్ పెట్టింది రకుల్. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో చెరో సినిమా ఉంది. తెలుగులో ఆమె నితిన్ సరసన నటిస్తోంది.