Rakul Preeth - ఆ ఒక్కటి చాలంటున్న బ్యూటీ

Tuesday,June 22,2021 - 11:41 by Z_CLU

రకుల్ ప్రీత్ సింగ్.. టాలీవుడ్ లీడింగ్ హీరోయిన్లలో ఒకరు. ఆమధ్య వరుసగా ఫ్లాపులొచ్చినా ఇప్పటికీ ఆమె తన కెరీర్ ను కొనసాగిస్తోంది. మంచి మంచి పాత్రలు పోషిస్తోంది. దీనికి కారణం ఏంటి అనే ప్రశ్న ఆమెకు ఎదురైంది. దానికి ఆమె ఇచ్చిన సమాధానం ఒకటే ఒక్కటి. ఇండస్ట్రీలో క్లిక్ అవ్వడానికి టాలెంట్ ఒక్కటి ఉంటే చాలంటోంది ఈ ముద్దుగుమ్మ.

rakul preeth new stills zeecinemalu

“చాలామంది ఇన్ సైడర్, ఔట్ సైడర్ అంటారు. ఇండస్ట్రీకి చెందిన జనాలకే తొందరగా అవకాశాలొస్తాయని, బ్యాక్ గ్రౌండ్ ఉన్నోళ్లే క్లిక్ అవుతారని అంటుంటారు. కానీ నాకు తెలిసి ఇవేవీ అక్కర్లేదు. మనలో టాలెంట్, కష్టపడే గుణం ఉంటే చాలు, ఏదో ఒక రోజు అవకాశం మనల్ని వెదుక్కుంటూ వస్తుంది. మనకి సక్సెస్ అందిస్తుంది. దీనికి నేనే బెస్ట్ ఎగ్జాంపుల్.”

rakul preeth new stills photos zeecinemalu

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన తనను టాలీవుడ్ ప్రోత్సహించిందని అంటోంది రకుల్. పరిచయాలు, బ్యాక్ గ్రౌండ్ అనేవి వెంటనే అవకాశం రావడానికి ఉపయోగపడతాయని.. కానీ అంతిమంగా ప్రేక్షకుల ఆదరణ బట్టే స్టార్ డమ్ వస్తుందని చెబుతోంది. తనను తెలుగు ప్రేక్షకులు ఆదరించినట్టు, మరే ఇతర భాషా ప్రేక్షకులు ఆదరించలేదని, అందుకే టాలీవుడ్ కు రుణపడి ఉంటానని చెబుతోంది రకుల్. ఇక బాలీవుడ్ పై స్పందిస్తూ.. ఇప్పటివరకు బాలీవుడ్ నుంచి తనకు హుషారెత్తించే పాట పడలేదంటోంది.

rakul 2

“హిందీ సినిమాల్లో ఎక్కువగా ఉండే టిపికల్ సాంగ్ ఇంకా నాకు పడలేదు. మంచి మ్యూజిక్ తో డాన్స్ చేసే పాటలు నాకు ఇంకా తగల్లేదు. అలాంటి సాంగ్ ఒకటి చేయాలనుంది. ఇక నా కెరీర్ విషయానికొస్తే, సినిమాల్ని, బిజినెస్ ను, లైఫ్ ను బ్యాలెన్స్ చేయడం నాకు బాగా తెలుసు. అందుకే బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా సినిమాలు చేస్తున్నాను. మనకు ఇష్టమైంది చేస్తే కష్టం అనిపించదు కదా.”

rakul preeth

ప్రస్తుతం రకుల్ చేతిలో 6 సినిమాలున్నాయి. వీటిలో 2 సినిమాలు పూర్తయ్యాయి. 2 సెట్స్ పై ఉన్నాయి. మరో 2 సినిమాల్ని సెట్స్ పైకి తీసుకురావాల్సి ఉంది. రకుల్ కు ఏ పరిశ్రమతో ఎలాంటి సంబంధం లేదు. ఆమెది ఆర్మీ బ్యాక్ గ్రౌండ్. మోడలింగ్ నుంచి సినిమాల్లోకి వచ్చింది. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics