Rakul Preeth - పంజాబీ కంటే తెలుగు ఎక్కువ
Wednesday,March 03,2021 - 03:19 by Z_CLU
ప్రస్తుతం తను పంజాబీ కంటే తెలుగులోనే ఎక్కువగా మాట్లాడుతున్నానని చెబుతోంది హీరోయిన్ రకుల్. చివరికి హిందీ సినిమా చేస్తున్నప్పుడు కూడా తెలుగులోనే మాట్లాడుతున్నానని అంటోంది. ఆమె చెబుతున్న మరికొన్ని డీటెయిల్స్ ఫటాఫట్ చూసేద్దాం

⇒ ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ నుంచి నా అసిస్టెంట్స్ సేమ్. తెలుగువాళ్లే. వాళ్లతో నేను తెలుగులో మాట్లాడతాను. అర్జున్ కపూర్‌తో నేను నటించిన ‘సర్దార్ కా గ్రాండ్‌సన్’ రీసెంట్‌గా ఆ సినిమా కోసం ప్రమోషనల్ సాంగ్ షూట్ చేశాం. దానికి సినిమాటోగ్రాఫర్ తెలుగు వ్యక్తి. మేం తెలుగులో మాట్లాడుకున్నాం. తెలుగువాళ్లు ఎవరైనా కనిపిస్తే… నేను తెలుగులో మాట్లాడతా. పంజాబీ కన్నా తెలుగుమ్మాయి అయిపోయా. ‘నీ పేరులో ప్రీత్ సింగ్ లేదంటే… నిన్ను తెలుగమ్మాయి అనుకుంటారు’ అని అర్జున్ కపూర్ చెప్పారు. విశేషం ఏంటంటే… ఆ సినిమాలో నేను సౌతిండియన్ అమ్మాయి రాధ పాత్రలో నటించా.

⇒ అజయ్ దేవగణ్, అమితాబ్ బచ్చన్‌తో ‘మే డే’ చిత్రీకరణ పూర్తి చేశా. ‘సర్దార్ కా గ్రాండ్‌సన్’ మూవీ మేలో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలవుతుంది. జాన్ అబ్రహంతో ‘ఎటాక్’ చేశా. ఆగస్టులో విడుదలవుతుంది. సిద్ధార్థ్ మల్హోత్రాతో ‘థాంక్ గాడ్’ చేస్తున్నా. ఆయుష్మాన్ ఖురానాతో ‘డాక్టర్ బి’ చేస్తున్నా. ఇంకో హిందీ సినిమాలు ఉన్నాయి. మార్చిలో ప్రకటిస్తారు. తమిళంలో శివ కార్తికేయన్‌తో చేసిన ‘అయలాన్’ సినిమా ఈ ఏడాదే విడుదలవుతుంది. తెలుగులో వైష్ణవ్ తేజ్ సినిమా కూడా ఈ ఏడాది విడుదల అవుతుంది.

⇒ ‘మే డే’ చిత్రీకరణ చేస్తున్నప్పుడు కొవిడ్19 వచ్చింది. 12వ రోజుల్లో కోలుకున్నా. క్వారంటైన్ ఉన్నప్పుడు సమస్యలేవీ లేవు. మొదటి నాలుగు రోజులు నిద్రపోయా. ఐదో రోజు నుంచి యోగా, ప్రాణాయామ, బ్రీతింగ్ వర్కవుట్స్ చేశా. నా వల్ల చిత్రీకరణ ఆగకూడదని 13వ రోజు నుంచి సెట్స్‌కి వెళ్లా. అప్పుడు బాడీలో అలసట వచ్చింది. కరోనా వల్ల వర్కవుట్స్ చేసేటప్పుడు… బాడీ పెయిన్స్ వచ్చాయి. చేయకపోతే బాగానే ఉండేది. నాకు కరోనా రాక ముందు సెట్స్‌కి వెళ్లడానికి కాస్త భయపడ్డా. వచ్చిన తర్వాత ధైర్యంగా వెళ్లి షూట్ చేశా. నాలో యాంటీబాడీస్ ఉన్నాయని! కరోనా నేపథ్యంలో ప్రస్తుతం అందరూ బాధ్యతగా ఉండాలి. బయటకు వెళ్లేటప్పుడు మాస్క్ ధరించండి. జాగ్రత్తలు పాటించండి.