Check సీక్వెల్ రెడీ ?

Thursday,February 25,2021 - 12:56 by Z_CLU

చంద్ర శేఖర్ ఏలేటి డైరెక్షన్ లో నితిన్ నటించిన ‘చెక్’ సినిమా రేపే థియేటర్స్ లోకి రానుంది. రిలీజ్ కి ముందే టీం ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని చెప్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ‘చెక్’ సీక్వెల్ గురించి చెప్పాడు నితిన్. సినిమాలో క్లైమాక్స్ చాలా బాగుంటుందని అలాగే సీక్వెల్ కి హింట్ ఉంటుందని అన్నాడు. ఈ కథకి సీక్వెల్ చేయడానికి స్కోప్ ఉందని తెలిపాడు.

‘చెక్’ కథ రాసుకున్నప్పుడే దానికి సీక్వెల్ ప్లాన్ చేసుకున్నారట చంద్ర శేఖర్. ఇటివలే ఆ స్క్రిప్ట్ కి సంబంధించి వర్క్ కూడా మొదలు పెట్టాడని తెలుస్తుంది. ప్రస్తుతం నితిన్ చేతిలో నాలుగు సినిమాలున్నాయి. అవి పూర్తవ్వగానే ఈ సీక్వెల్ సెట్స్ పైకి రావొచ్చు. ఇక ‘చెక్’ మంచి విజయం సాదిస్తే ఇంకా తొందరగానే సీక్వెల్ పట్టాలెక్కుతుంది. ప్రతీ సినిమాకు రెండు, మూడేళ్ళు గ్యాప్ తీసుకునే చంద్రశేఖర్ ఏలేటి నెక్స్ట్ ఈ సీక్వెల్ తోనే రావడం ఖాయమనిపిస్తుంది.