ఆ మేటర్ తో నాకు సంబంధం లేదు - రకుల్

Thursday,May 28,2020 - 02:23 by Z_CLU

ఈ లాక్ డౌన్ టైమ్ లో సినిమాను థియేట్రికల్ రిలీజ్ వరకు ఉంచాలా లేక ముందే ఓటీటీకి ఇచ్చేయాలా అనే డిస్కషన్ జోరుగా సాగుతోంది. ఇంకా చెప్పాలంటే ఈ టాపిక్ పై టాలీవుడ్ రెండుగా విడిపోయింది. ఇలాంటి హాట్ టాపిక్ పై రియాక్ట్ అవ్వడానికి రకుల్ ఇష్టపడలేదు.

సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలా లేక థియేటర్ లో రిలీజ్ చేయాలా అనే మేటర్ తో తనకు సంబంధం లేదంటోంది రకుల్. అది పూర్తిగా నిర్మాత ఇష్టమని, ఆ విషయంలో తనతో పాటు ఏ హీరోయిన్ కు రియాక్ట్ అయ్యే హక్కు లేదంటోంది.

ఇక షూటింగ్స్ గురించి మాట్లాడుతూ.. ఎటాక్ అనే సినిమాతో పాటు అర్జున్ కపూర్ తో కలిసి చేస్తున్న మరో సినిమా ఫినిషింగ్ స్టేజ్ లో ఉందని తెలిపింది రకుల్. ఆయా రాష్ట్రాల్లో ఇచ్చే అనుమతులు, పరిస్థితుల బట్టి తన కాల్షీట్లు ఎడ్జెస్ట్ చేస్తానని, ఏ సినిమాకు ముందుగా కాల్షీట్లు ఇస్తానో తనకే తెలియదని అంటోంది