జీ సినిమాలు ( 16th అక్టోబర్ )

Tuesday,October 15,2019 - 10:03 by Z_CLU

అష్టాచెమ్మా

నటీనటులు : నానిశ్రీనివాస్ అవసరాలస్వాతిభార్గవి

ఇతర నటీనటులు : తనికెళ్ళ భరణిహేమఝాన్సీవాసు ఇంటూరిశివన్నారాయణరాగిణి

మ్యూజిక్ డైరెక్టర్ : కల్యాణి మాలిక్

డైరెక్టర్ : మోహన్ కృష్ణ ఇంద్రగంటి

ప్రొడ్యూసర్ రామ్ మోహన్

రిలీజ్ డేట్ : 5 సెప్టెంబర్ 2008

నానిఅవసరాల శ్రీనివాస్స్వాతిభార్గవి నలుగురికి ఒకేసారిగా  రేంజ్ స్టార్ డం నితీసుకొచ్చి పెట్టిన సినిమా ‘అష్టా చెమ్మా’. సూపర్ స్టార్ మహేష్ బాబుని పెళ్ళిచేసుకోవాలనుకునే లావణ్య చివరికి మహేష్ అనే పేరున్నా చాలు అతన్నే పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది తరవాత ఏం జరిగింది అన్నదే ప్రధాన కథాంశం.

==============================================================================

కళ్యాణ వైభోగమే
నటీనటులు : నాగశౌర్య, మాళవిక నాయర్
ఇతర నటీనటులు : రాశి, ఆనంద్, ప్రగతి, నవీన్ నేని, ఐశ్వర్య, తాగుబోతు రమేష్ మరియుతదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : కళ్యాణ్ కోడూరి
డైరెక్టర్ : B.V. నందిని రెడ్డి
ప్రొడ్యూసర్ : K.L. దామోదర్ ప్రసాద్
రిలీజ్ డేట్ : 4 మార్చి 2016
నందిని రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన హిల్లేరియస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కళ్యాణ వైభోగమే. కేవలం పెద్దల బలవంతం పై పెళ్లి చేసుకున్న ఒక యువజంట పెళ్లి తరవాత ఏం చేశారు..? అనేదే ఈ సినిమా ప్రధానాంశం. యూత్ ఫుల్ కామెడీ ఈ సినిమాలో పెద్ద హైలెట్.

=============================================================================

స్పైడర్
నటీనటులు : మహేష్ బాబురకుల్ ప్రీత్ సింగ్
ఇతర నటీనటులు : S.J. సూర్యభరత్, RJ బాలాజీప్రియదర్శిజయప్రకాష్సాయాజీ షిండే
మ్యూజిక్ డైరెక్టర్ : హారిస్ జయరాజ్
డైరెక్టర్ : A.R. మురుగదాస్
ప్రొడ్యూసర్ : N.V. కుమార్ఠాగూర్ మధు
రిలీజ్ డేట్ : 27 సెప్టెంబర్ 2017
ఇంటలిజెన్స్ బ్యూరో లో పనిచేసే శివ(మహేష్ బాబు) అందరి కాల్స్ ట్రాప్ చేస్తూ తను రెడీ చేసుకున్న ఓ సాఫ్ట్ వేర్ ద్వారా సమాజంలో ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడికెళ్లి ఎలాంటి తప్పు జరగకుండా అడ్డుపడుతుంటాడు.. అలా సాటి మనిషికి ఎటువంటి బాధ కలగకూడదనే వ్యక్తిత్వంతో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా జీవితాన్నిగడిపే శివట్రాప్ ద్వారా ఓ కాల్ వింటాడు.
అనుకోకుండా విన్న ఆ కాల్ శివ జీవితంలో ఓ పెద్ద మార్పు తీసుకొస్తుంది.. ఆ ఫోన్ కాల్ విన్న మరసటి రోజే శివ జీవితంలోకి వస్తాడు భైరవుడు… ఇంతకీ భైరవుడు ఎవరు ? అసలు శివకి భైరవుడికి మధ్య ఏం జరిగింది ? చివరికి శివ భైరవుడిని ఎలా అంతమొందించి ప్రజల్ని కాపాడాడనేది సినిమా కథాంశం.

==============================================================================

సైజ్ జీరో
నటీనటులు : అనుష్క శెట్టిఆర్య
ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్ఊర్వశిసోనాల్ చౌహాన్అడివి శేష్బ్రహ్మానందంగొల్లపూడి మారుతి రావుతనికెళ్ళ భరణి మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : M.M. కీరవాణి
డైరెక్టర్ : ప్రకాష్ కోవెలమూడి
ప్రొడ్యూసర్ ప్రసాద్ వి. పొట్లూరి
రిలీజ్ డేట్ : 27 నవంబర్ 2015
అధిక బరువు ఉన్నప్పటికీ ఏ మాత్రం కాన్ఫిడెన్స్ తగ్గని సౌందర్య అభిషేక్ తో ప్రేమలో పడుతుంది. తన ప్రేమని పొందటం కోసంఅతి తక్కువ కాలంలో బరువు తగ్గించే క్లినిక్ లో కూడా జాయిన్ అవుతుంది. సౌందర్య అక్కడేం తెలుసుకుంటుంది..చివరికి సౌందర్య బరువు తగ్గుతుందా..అభిషేక్ ప్రేమను తను పొందగలుగుతుందా..అనేదే ఈ సినిమా కథ. అనుష్క పర్ఫామెన్స్ సినిమాకి హైలెట్ గా నిలుస్తుంది.

==============================================================================

ఎక్కడికి పోతావు చిన్నవాడా

నటీనటులు : నిఖిల్ సిద్ధార్థహేబా పటేల్అవిక గోర్

ఇతర నటీనటులు : నందితా శ్వేతవెన్నెల కిషోర్అన్నపూర్ణసత్యసుదర్శన్ మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : శేఖర్ చంద్ర

డైరెక్టర్ : వి. ఐ. ఆనంద్

ప్రొడ్యూసర్ : P.V. రావు

రిలీజ్ డేట్ : 18 నవంబర్ 2016

ఒక అమ్మాయిని ప్రేమించి మోసపోయిన అర్జున్(నిఖిల్) తన స్నేహితుడి అన్నయ్య కు దెయ్యం వదిలించడానికి అనుకోకుండా ఆత్మలను వదిలించే కేరళ లోని మహిశాసుర మర్దిని గుడికి వెళ్లాల్సి వస్తుంది. అలా కిషోర్(వెన్నెల కిషోర్) తో కేరళ వెళ్లిన అర్జున్ కి అమల(హెబ్బా పటేల్) అనే అమ్మాయి పరిచయం అవుతుంది. అలా పరిచయమైన అమల తన యాటిట్యూడ్ తో అర్జున్ కు దగ్గరవుతుంది. ఇంతకీ అమల అక్కడికి ఎందుకొచ్చిందిఅర్జున్ కి కావాలనే ఎందుకు దగ్గరైందిఅసలు అమల ఎవరుకేరళ వెళ్లిన అర్జున్ హైదరాబాద్ తిరిగొచ్చాక అమల గురించి ఏం తెలుసుకున్నాడుఅనేది చిత్ర కధాంశం.

==============================================================================

గీతాంజలి
నటీనటులు : అంజలి, శ్రీనివాస్ రెడ్డి
ఇతర నటీనటులు : మధునందన్, హర్షవర్ధన్ రాణే, బ్రహ్మానందం, ఆలీ, రావు రమేష్, సత్యం రాజేష్, శంకర్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : ప్రవీణ్ లక్కరాజు
డైరెక్టర్ : రాజ్ కిరణ్
ప్రొడ్యూసర్ : కోన వెంకట్
రిలీజ్ డేట్ : 8 ఆగష్టు 2014
అంజలి ప్రధాన పాత్రలో శ్రీనివాస్ రెడ్డి హీరోగా నటించిన హారర్ కామెడీ ఎంటర్ టైనర్ గీతాంజలి. ఈ సినిమాలో అంజలి డ్యూయల్ రోల్ లో ఎంటర్ టైనర్ చేసింది. ఫ్లాష్ బ్యాక్ లో ఇన్నోసెంట్ అమ్మాయిగా అంజలి నటన సినిమాకే హైలెట్ గా నిలిచింది.