జీ సినిమాలు ( 19th సెప్టెంబర్)

Monday,September 18,2017 - 10:06 by Z_CLU

ఆ ఇంట్లో

నటీనటులు : చిన్నా, మయూరి

ఇతర నటీనటులు : వినోద్ కుమార్, దేవన, కోట శ్రీనివాస రావు

మ్యూజిక్ డైరెక్టర్ : కోటి

డైరెక్టర్ : చిన్న

ప్రొడ్యూసర్ : S. శ్రీనివాస రెడ్డి , రాజు చౌదరి

రిలీజ్ డేట్ : 2009

చిన్నా ప్రధాన పాత్రలో నటించిన ఆ ఇంట్లో హారర్ ఎంటర్ టైనర్. తన ఇద్దరు పిల్లలతో కొత్త ఇంట్లోకి అడుగు పెట్టిన హీరో అక్కడ ఏం చూశాడు..? అక్కడి పరిస్థితులను ఎదుర్కోవడానికి తాంత్రికుడిని కలుసుకున్న హీరో ఏం తెలుసుకున్నాడు అనేదే ప్రధాన కథాంశం.

==============================================================================

స్వాగతం

నటీనటులు : జగపతి బాబు, భూమిక చావ్లా, అనుష్క శెట్టి

ఇతర నటీనటులు : అర్జున్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఆలీ, సునీల్, వేణు మాధవ్, మల్లికార్జున రావు, M.S. నారాయణ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : R.P. పట్నాయక్

డైరెక్టర్ : దశరథ్

ప్రొడ్యూసర్ : ఆదిత్య రామ్

రిలీజ్ డేట్ : 25 జనవరి 2008

రొటీన్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా జీవితం విలువలను సున్నితంగా తడుతూ తెరకెక్కిన సినిమా’ స్వాగతం’ దశరథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ ఇమోషనల్ ఎంటర్ టైనర్ లో భూమిక నటన హైలెట్ గా నిలుస్తుంది. R.P. పట్నాయక్ మ్యూజిక్ ఈ సినిమాకి ప్రాణం.

==============================================================================

లక్ష్మీ రావే మ ఇంటికి

నటీనటులు : నాగశౌర్య, అవికా గోర్

ఇతర నటీనటులు : వెన్నెల కిషోర్, రావు రమేష్, నరేష్, కాశి విశ్వనాథ్, సప్తగిరి, సత్యం రాజేష్, నల్ల వేణు, ప్రగతి, పవిత్ర లోకేష్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : రాధాకృష్ణ

డైరెక్టర్ : నంద్యాల రవి

ప్రొడ్యూసర్ : గిరిధర్ మామిడిపల్లి

రిలీజ్ డేట్ : డిసెంబర్ 5, 2014

నాగశౌర్య, అవికా గోర్ జంటగా తెరకెక్కిన అద్భుత ప్రేమ కథా కుటుంబ చిత్రం లక్ష్మీ రావే మా ఇంటికి. నంద్యాల రవి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ అయిన అన్ని థియేటర్ల లోను సూపర్ హిట్ అయింది. రాధాకృష్ణ సంగీతం సినిమాకి హైలెట్.

=============================================================================

ప్రేమాభిషేకం

నటీనటులు : శ్రీహరి, వేణుమాధవ్, ప్రియా మోహన్

ఇతర నటీనటులు : రుతిక, ఆలీ, నాగబాబు, తదితరులు..

మ్యూజిక్ డైరెక్టర్ : చక్రి

డైరెక్టర్ : విక్రమ్ గాంధీ

ప్రొడ్యూసర్ : వేణు మాధవ్

రిలీజ్ డేట్ : 14 మార్చి 2008

వేణుమాధవ్, ప్రియా మోహన్ హీరో హీరోయిన్లుగా నటించిన కామెడీ ఎంటర్ టైనర్ ప్రేమాభిషేకం. విక్రం గాంధీ డైరెక్షన్ చేసిన ఈ సినిమాకి చక్రి సంగీతం అందించాడు. శ్రీహరి పర్ఫామెన్స్ సినిమాకి హైలెట్ గా నిలిచింది.

=============================================================================

బ్రదర్ అఫ్ బొమ్మాళి

నటీనటులు : అల్లరి నరేష్, కార్తీక, మోనాల్ గజ్జర్

ఇతర నటీనటులు : హర్ష వర్ధన్ రాణే, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : శేఖర్ చంద్ర

డైరెక్టర్ : చిన్ని కృష్ణ

ప్రొడ్యూసర్ : అమ్మి రాజు కనిమిల్లి

రిలీజ్ డేట్ : నవంబర్ 7 , 2014

కామెడీ కింగ్ అల్లరి నరేష్ హీరోగా , కార్తీక, మోనాల్ గజ్జర్ ఇతర పాత్రల్లో నటించిన కామెడీ ఎంటర్టైనర్ ‘బ్రదర్ అఫ్ బొమ్మాలి’. ఈ సినిమా లో అల్లరిగా నరేష్ అక్కగా కార్తీక యాక్టింగ్ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది.  కోన వెంకట్ గా బ్రహ్మానందం కామెడీ, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి కామెడీ సీన్స్ కడుపుబ్బా నవ్విస్తాయి. అల్లరి నరేష్ ఎనర్జీ తో కూడిన ఫన్నీ  పెరఫార్మెన్స్, శేఖర్ చంద్ర మ్యూజిక్, కామెడీ సీన్స్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్స్.

==============================================================================

గ్యాంగ్ మాస్టర్

నటీనటులు : రాజశేఖర్, వాణి విశ్వనాథ్

ఇతర నటీనటులు : కృష్ణం రాజు, నగ్మా, బ్రహ్మానందం, సెల్వ, సుభాషిణి, చరణ్ రాజ్, శ్రీహరి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : A.R. రహమాన్

డైరెక్టర్ : B. గోపాల్

ప్రొడ్యూసర్ : T. సుబ్బరామి రెడ్డి

రిలీజ్ డేట్ : 15 జూలై 1994

రాజశేఖర్, నగ్మా జంటగా నటించిన సూపర్ హిట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గ్యాంగ్ మాస్టర్. A.R. రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమా తమిళంలోను ‘మనిత మనిత’ అనే టైటిల్ తో రిలీజయింది. యాక్షన్ సీక్వెన్సెస్ ఈ సినిమాకి హైలెట్ గా నిలిచాయి.