మే నుండి జూన్ కి షిఫ్ట్ అయిన 'రాజు గాడు'

Sunday,May 06,2018 - 10:40 by Z_CLU

యంగ్ హీరో రాజ్‌తరుణ్‌ లేటెస్ట్ మూవీ ‘రాజు గాడు’ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఇటివలే షూటింగ్ ఫినిష్ చేసుకొని ప్రెజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాను ముందుగా మే నెలలో రిలీజ్ చేయాలనుకున్న మేకర్స్ ఇప్పుడు రిలీజ్ డేట్ ని  జూన్ 1స్ట్ కి అఫీషియల్ గా అనౌన్స్ చేసారు.

‘ఈడోరకం-ఆడోరకం’, ‘కిట్టుఉన్నాడుజాగ్రత్త’, ‘అంధగాడు’ సినిమాలతో ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ సంస్థలో హాట్రిక్ హిట్ అందుకున్న రాజ్‌త‌రుణ్ ఏకే సంస్థలో నటిస్తున్న నాలుగో సినిమా ఇది.  సంజనా రెడ్డి దర్శకురాలుగా పరిచయం అవుతున్న ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందించాడు  రామబ్రహ్మం సుంకర నిర్మాత.