స్టూడియో రౌండప్

Sunday,May 06,2018 - 12:03 by Z_CLU

ప్రభాస్ – సాహో

ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్  స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘సాహో’ షూటింగ్ ప్రెజెంట్ అబూదాబిలో జరుగుతుంది. 50 రోజుల పాటు జరిగే షెడ్యూల్ లో ప్రభాస్ పై కొన్ని యాక్షన్ సీన్స్ షూట్ చేయనున్నారు యూనిట్. యు.వి.క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సుజీత్ దర్శకుడు.

 

నితిన్ – శ్రీనివాస కళ్యాణం

నితిన్ హీరోగా తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘శ్రీనివాస కళ్యాణం’ ప్రెజెంట్ చండీఘర్ లో షూటింగ్ జరుపుకుంటుంది. నితిన్, రాశి ఖన్నా లతో పాటు మిగతా నటీ నటులతో కొన్ని సీన్స్ షూట్ చేస్తున్నారు యూనిట్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు.

 

సాయి ధరమ్ తేజ్ – తేజ్ ఐ లవ్  యు

సాయిధరం తేజ్ లేటెస్ట్ మూవీ ‘తేజ్ ఐ లవ్ యూ’ ప్రస్తుతం సాంగ్స్ షూట్ జరుపుకుంటుంది. కరుణాకరన్ డైరెక్షన్ లో రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రెజెంట్ పారీస్ లోని బ్యూటిఫుల్ లోకేషన్స్ లో సాంగ్స్ షూట్ జరుపుకుంటుంది. రెండు సాంగ్స్ షూట్ చేసుకొని మే 8 కి రిటర్న్ అవుతారు యూనిట్.