కీర్తి సురేష్ ఇంటర్వ్యూ

Sunday,May 06,2018 - 10:02 by Z_CLU

మహానటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం “మహానటి”. నాగ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ బయోపిక్ లో  కీర్తి సురేష్ “మహానటి సావిత్రి” టైటిల్ పాత్ర లో నటించింది. అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 9న విడుదలవుతుంది. ఈ సందర్భంగా ‘మహానటి’కి  సంబంధించి నటిగా తన అనుభవాలు, అనుభూతులను  మీడియాతో పంచుకొంది కీర్తీ సురేష్. ఆ విశేషాలు కీర్తీ మాటల్లోనే…

ఏడాదిన్నర పాటు..

ఇప్పటివరకూ ఒక సినిమా కోసం మహా అయితే మూడు లేదా నాలుగు నెలలు పనిచేసాను. కానీ.. ‘మహానటి’ కోసం దాదాపు 10 నెలలు పాటు షూటింగ్ కోసమే స్పెండ్ చేశాను. ప్రీప్రొడక్షన్ కోసం రెండు నెలలు, డబ్బింగ్ కోసం ఒక నెల. ఈమధ్యలో గ్యాప్స్ అన్నీ కలిపితే దాదాపు ఏడాదిన్నర పాటు ‘మహానటి’ సినిమాతో  ట్రావెల్ చేశాను. అందుకే ఈ సినిమా నా మనసుకి దగ్గరైన సినిమా.

 

నాగ అశ్విన్ ఛాయిస్ నేనే…

నాకంటే ముందు టైటిల్ రోల్ కోసం చాలా మంది పేర్లు వినిపించాయి. కానీ.. డైరెక్టర్ నాగఅశ్విన్ కి మాత్రం నేనే ఫస్ట్ ఛాయిస్. అందుకే ఎంతమంది ఆప్షన్స్ వచ్చినా నన్నే ప్రిఫర్ చేశాడు. గతంలో నేను నటించిన ‘రైల్’ సినిమాలో నా  క్యారెక్టర్ పెర్ఫార్మెన్స్ నచ్చి నన్ను ఈ సినిమా కోసం తీసుకొన్నాడని తర్వాత చెప్పాడు నాగి.

 షాక్ అయ్యాను..

నేను యాక్టింగ్ కెరీర్ మొదలుపెట్టినప్పట్నుంచి ఇప్పటివరకు ఎవరూ కనీసం ఒక్కసారి కూడా నువ్ సావిత్రిలా ఉంటావ్ అని నేను వినలేదు. అలాంటిది నాగఅశ్విన్ వచ్చి మీరు సావిత్రి గారిలా యాక్ట్ చేయాలి, మీరే ఆ పాత్రకు బాగుంటారు. అని చెప్పినప్పుడు షాక్ అయ్యాను. ముందు అసలు సీరియస్ గా తీసుకోలేదు. తర్వాత అశ్విన్ ఫుల్ నేరేషన్ ఇచ్చాక వెంటనే నా రూమ్ లో ఉన్న అద్దంలో “అసలు సావిత్రిలా ఏ యాంగిల్ లో కనిపించాను అని నా ముఖం నేను చూసుకున్నాను”.

100 లుక్స్ ట్రై చేశాం..

బేసిగ్గా నేను చాలా ట్రెడిషనల్ గా ఉంటాను. నాకు చీరలు కట్టుకోవడం కొత్త కాదు, అందువల్ల ఎక్కువగా శారీస్ కట్టుకోవడానికే ప్రాధాన్యం ఇస్తాను. “మహానటి”లో ఎక్కువగా శారీస్ కట్టుకోవాలి అని తెలిసినప్పుడు నిజంగా సంతోషపడ్డాను. సినిమాలో నేను సావిత్రి గారిలా కనిపించడం కోసం చాలా లుక్ టెస్ట్స్ చేశాం. అందువల్ల అసలు ఏ లుక్ బయటకి వస్తుంది అనే విషయంలో నాకే క్లారిటీ లేకుండాపోయింది. ముఖ్యంగా షూటింగ్ లో రోజుకి 4, 5 డ్రెస్ ఛేంజస్ చేసేదాన్ని.

తక్కువ సమయలోనే..

సినిమాలో సావిత్రిగారి జీవితంలో ముఖ్యమైన సంఘటలను, కొన్ని సినిమాల్లోని కీలకమైన సన్నివేశాలను సినిమాలో చిత్రీకరించాలి. అలాగని ఒకే సన్నివేశాన్ని ఎక్కువ లెంగ్త్ తో చూపిస్తే ప్రేక్షుకులకు బాగా బోర్ కొడుతుంది, పైగా నిడివి కూడా  రన్ సరిపోదు. అందుకే తక్కువ సమయం లో ఎక్కువ సన్నివేశాలను చిత్రీకరించాం. ఆ సన్నివేశాలన్నీ ప్రేక్షకులకు మంచి అనుభూతి కలిగిస్తాయి.

ఆవిడ లా నటించడం చాలా కష్టం..

ఈ సినిమా ఒప్పుకున్నాక నాకు ఎదురైన  ఛాలెంజ్ లు రెండు. అందులో ఒకటి  నేను అసలు సావిత్రిలా స్క్రీన్ మీద కనిపించగలుగుతానా? రెండు ఆవిడ స్థాయిలో ఆవిడ పాత్రకు న్యాయం చేయగలుగుతానా?. లుక్ కోసం చేసిన ఫోటో షూట్,  రెండు రోజుల షూటింగ్ అనంతరం లుక్ గురించి టెన్షన్ తగ్గిపోయింది. ఆ తర్వాత ‘మహానటి’గా ఆమె స్థాయిలో నటించగలనా లేదా అనేది మాత్రం విడుదల తర్వాత  ప్రేక్షకులే  చెప్తారు. దానికోసం ఎదురుచూస్తున్నా.

ఆవిడ గురించి చాలా తెలుసుకున్నా..

సినిమా సైన్ చేయగానే సావిత్రి గారి కుమార్తె విజయ చాముండేశ్వరిగారితో మాట్లాడడం జరిగింది. ఆమె సావిత్రి గారి గురించి కొన్ని పర్సనల్ డీటెయిల్స్ నాకు పంపించారు. వాటిలో చాలా విషయాలు నా పర్సనల్ క్యారెక్టర్ కు మ్యాచ్ అయ్యాయి. ఉదాహరణకు నాకు స్విమ్మింగ్, క్రికెట్ అంటే పిచ్చి. సావిత్రిగారికి కూడా అవంటే విపరీతమైన ఇష్టమట. అవి తెలుసుకొని ఆశ్చర్యపోయాను.

ఆమె మీద అభిమానం రెట్టింపయ్యింది..

సావిత్రి గారు చాలా గొప్ప నటీమణి, రేస్ కార్స్ అంటే ఇష్టం వంటి విషయాలు మాత్రమే అందరికీ తెలుసు. కానీ.. సినిమాలో నటిస్తున్నప్పుడు నాకు తెలిసినదేమిటంటే..షూటింగ్ సమయంలో  సావిత్రిగారు అందరితో  చాలా సరదాగా ఉండేవారట. అలాగే.. తన పరిస్థితిని దృష్టిలో పెట్టుకోకుండా.. తన, పరాయి అన్న బేధం లేకుండా  అడిగినవారికి తనకు తోచిన సహాయం చేసేవారట. ఇలాంటి విషయాలు తెలిసాక ఆమె మీద అభిమానం రెట్టింపయ్యింది.

అతనితో ఇదే మొదటి సారి

దుల్కర్ సల్మాన్ ఈ సినిమాలో జెమినీ గనేషన్ గా నటిస్తున్నాడని తెలియగానే చాలా సంతోషపడ్డాను. దుల్కర్ నాకు చినతనం నుండి బాగా తెలుసు. మేమిద్దరం ఎప్పటి నుండో ఫ్యామిలీ ఫ్రెండ్స్. కానీ కలిసి ఒక్క సినిమా కూడా చేయలేదు. మేమిద్దరం కలిసి నటించడం  ఇదే మొదటి సారి. తన క్యారెక్టర్ కి దుల్కర్ పర్ఫెక్ట్ అనిపించాడు. రేపు ఆడియన్స్ కూడా అదే ఫీల్ అవుతారు.

ఇకపై ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటాను..

ఇప్పటివరకూ నేను ఎలాంటి సినిమాలు చేసినా, ఎలాంటి పాత్రలు పోషించినా పట్టించుకొనేవారు కాదు. కానీ.. “మహానటి”గా టైటిల్ పాత్ర పోషిస్తున్నాను కాబట్టి నా మీద బాధ్యత మరింతగా పెరిగింది. అందుకే ఇకపై నటించే సినిమాల్లో నా పాత్ర కేవలం పాటలకి పరిమితం కాకుండా కథలో భాగమైయ్యేలా, ప్రాధాన్యత ఉండేలా కొన్ని జాగ్రత్తలు తీసుకొంటాను.

నేనే డబ్బింగ్ చెప్పుకున్నా.. ఇది రెండో సారి

ఇన్నాళ్ళు నాకు వచ్చిందే అసలైన తెలుగు అనుకున్నాను. కానీ.. తెలుగులో, ముఖ్యంగా స్పష్టమైన తెలుగులో మాట్లాడడం ఎంత కష్టం అనే విషయం “మహానటి” సినిమాకి డబ్బింగ్ చెబుతున్నప్పుడు తెలిసింది. చాలామంది సహాయం తీసుకొని ఈ చిత్రానికి డబ్బింగ్ చెప్పాను. ముఖ్యంగా శ్రీనివాస్ గారు లేకపోతే డబ్బింగ్ రూమ్ లో అడుగుపెట్టేదాన్ని కాదు. ఆయన చాలా హెల్ప్ చేసారు.

మోహన్ బాబు గారు  ఆశ్చర్య పోయారు..

నా చిన్నప్పుడు ఒకసారి మోహన్ బాబు గారి దగ్గర ‘ఆటోగ్రాఫ్’ తీసుకొన్నాను. అది దాదాపు పన్నెండేళ్ళ క్రితం. అలాంటిది మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఆయనతో కలిసి నటించడం చాలా ఆనందంగా అనిపించింది. షూటింగ్ మొదలయ్యాక ఆయన దగ్గరకి వెళ్లి ఆ ‘ఆటోగ్రాఫ్’ ను చూపించాను. ఆయన ఆశ్చర్యపోయారు. ఇది ఎప్పటిది అని అడుగుతూ నా వయసు అయిపోయిందని గుర్తుచేస్తున్నవా..అంటూ ఆటపట్టించారు. ఆయన దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నా .

టెన్షన్ ఉంది..

సినిమా కోసం చాలా కష్టపడ్డాం. సినిమా రిలీజ్ దగ్గరపడుతుంటే కాస్త టెన్షన్ గా ఉంది. గతంలో నేను నటించిన ఏ సినిమాకు ఇంత టెన్షన్ పడలేదు. ‘మహానటి’ లా అలరించాగాలిగానా..లేదా అని ప్రేక్షకులు చెప్తే తెలుసుకోవాలని ఉంది. విడుదలయ్యాక సినిమా హిట్ అవుతుందా లేదా అనే విషయం కంటే ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకొంటారు అనే విషయం గురించి ఎక్కువ టెన్షన్ పడుతున్నాం. కానీ డబ్బింగ్ చెప్తున్నప్పుడు నేను పొందిన సంతోషం ప్రేక్షకులు కూడా పొందుతారని సినిమా అందరికీ నచ్చుతుందన్న నమ్మకం  ఉంది.