రాజుగారి గది-2 ట్రయిలర్ రివ్యూ

Wednesday,September 20,2017 - 10:55 by Z_CLU

ఫస్ట్ టైం హారర్-కామెడీ జానర్ లో నాగార్జున నటించిన సినిమా రాజుగారి గది-2. ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కిన రాజుగారి గది-2 సినిమా ట్రయిలర్.. అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా ఈరోజు విడుదల చేశారు. సినిమా స్టోరీ ఏంటనే విషయాన్ని ట్రయిలర్ లోనే సింపుల్ గా చెప్పే ప్రయత్నం చేశారు.

మెంటలిస్ట్ క్యారెక్టర్ లో నాగార్జున అదిరిపోయాడు. నాగ్ ఎంట్రీ, లుక్స్, డైలాగ్స్.. ఇలా అన్నీ సింప్లీ సూపర్బ్. గ్రాఫిక్స్ కూడా బాగున్నాయి. దెయ్యం మిస్టరీని చేధించే బాధ్యతను నాగార్జున తీసుకుంటే.. రాజుగారి గదిలో ఉంటూ కామెడీ పండించే బాధ్యతను వెన్నెలకిషోర్, షకలక శంకర్, ప్రవీణ్ పంచుకున్నారు. అయితే సినిమాలో కీలకపాత్ర పోషించిన సమంత ఎలిమెంట్ ను మాత్రం ట్రయిలర్ లో చూపించలేదు. సస్పెన్స్ మెయింటైన్ చేశారు.

పీవీపీ సినిమా, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్, ఓక్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్లు కలిసి రాజుగారి గది-2 సినిమాను నిర్మించాయి. ఇప్పటికే హిట్ అయిన రాజుగారి గది సినిమాకు తాజా చిత్రానికి ఎలాంటి సంబంధం లేదని నాగ్ ఇప్పటికే ప్రకటించాడు. కేవలం ఆ టైటిల్ ను మాత్రమే వాడుకున్నామని స్పష్టంచేశాడు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది రాజుగారి గది-2 సినిమా.