జీ సినిమాలు ( 20th సెప్టెంబర్)

Tuesday,September 19,2017 - 10:03 by Z_CLU

బావ

నటీనటులు : సిద్ధార్థ, ప్రణీత

ఇతర నటీనటులు : రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, నాజర్, సింధు తులాని

మ్యూజిక్ డైరెక్టర్ : చక్రి

డైరెక్టర్ : రామ్ బాబు

ప్రొడ్యూసర్ : పద్మ కుమార్ చౌదరి

రిలీజ్ డేట్ : 29 డిసెంబర్ 2010

అందమైన పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కిందే బావ. ఈ సినిమాలో సిద్ధార్థ, ప్రణీత హీరో హీరోయిన్లుగా నటించారు. రాజేంద్ర ప్రసాద్ సిద్ధార్థ తండ్రి సీతారామ్ గా నటించాడు. నిజానికి అసలు కథ సీతారామ్ దగ్గరి నుండే మొదలవుతుంది. ప్రేమించి పెళ్ళి చేసుకున్న తను తన భార్య కుటుంబం నుండి తనను దూరం చేశాననే గిల్ట్ ఫీలిగ్ తో తను చేసిన తప్పు తన కొడుకు చేయకూడదు అనుకుంటూ ఉంటాడు. అంతలో వీరబాబు(సిద్ధార్థ) ఒక అమ్మాయి ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయి తన భార్య అన్న అకూతురు అని తెలుసుకున్న సీతారామ్, వీరబాబుతో తన ప్రేమను మర్చిపొమ్మంటాడు. అప్పుడు వీరబాబు ఏం చేస్తాడు..? కథ ఏ మలుపు తిరుగుతుందన్న అంశాలు జీ సినిమాలు  లో చూడాల్సిందే.

==============================================================================

 

ప్రేమాభిషేకం

నటీనటులు : అక్కినేని నాగేశ్వర రావు, శ్రీదేవి, జయసుధ

ఇతర నటీనటులు : మురళి మోహన్, మోహన్ బాబు, గుమ్మడి, ప్రభాకర రెడ్డి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : చక్రవర్తి

డైరెక్టర్ : దాసరి నారాయణ రావు

ప్రొడ్యూసర్ : వెంకట్ అక్కినేని, నాగార్జున అక్కినేని

రిలీజ్ డేట్ : 1 ఫిబ్రవరి 1981

టాలీవుడ్ లెజెండ్రీ యాక్టర్ ANR నటించిన అద్భుతమైన సినిమాలలో ప్రేమాభిషేకం ఒకటి. దాసరి నారాయణ రావు గారి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఆధారంగా చేసుకుని ఆ తరవాత కూడా ఎన్నో ప్రేమ కథలు తెరకెక్కాయి. ANR నట జీవితంలో మైలు రాయిలాంటిదీ ప్రేమాభిషేకం. ఈ సినిమాలో సన్నివేశానుసారంగా పొదిగిన పాటలు సినిమాకే హైలెట్.

==============================================================================

శ్రీ మహాలక్ష్మి

నటీనటులు : శ్రీహరి, సుహాసిని  షామ్న

ఇతర నటీనటులు : సన, సాయాజీ షిండే, తిలకన్, ముమైత్ ఖాన్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ

డైరెక్టర్ : విజయన్

ప్రొడ్యూసర్ : శాంతి శ్రీహరి

రిలీజ్ డేట్ : 4 మే 2007

రియల్ స్టార్ శ్రీహరి కరియర్ లోనే బెస్ట్ సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్. పవర్ ఫుల్ లాయర్ లక్ష్మీ కృష్ణ దేవరాయ క్యారెక్టర్ లో కనిపించిన శ్రీహరి నటన సినిమాకే హైలెట్. శ్రీహరికి అక్కగా సుహాసినీ మణిరత్నం సినిమాలో కీలక పాత్ర పోషించారు. ఒక అమ్మాయిని హత్య చేసిన నేరంలో తొమ్మిది మంది అమ్మాయిలు అరెస్ట్ అవుతారు. ఆ  హత్య నిజానికి ఆ అమ్మాయిలే చేశారా..? లాయర్ లక్ష్మీ కృష్ణ దేవరాయ ఆ కేసును ఎలా చేధించాడు అన్నదే ప్రధాన కథాంశం.

=============================================================================

అలా మొదలైంది

నటీనటులు : నాని, నిత్యా మీనన్

ఇతర నటీనటులు : వైశిష్ట, ఆశిష్ విద్యార్థి, కృతి కర్బంద, స్నేహ ఉల్లాల్

మ్యూజిక్ డైరెక్టర్ : కళ్యాణి మాలిక్

డైరెక్టర్ : నందిని రెడ్డి

ప్రొడ్యూసర్ : K.L. దామోదర్ ప్రసాద్

రిలీజ్ డేట్ : 21 జనవరి 2011

నాని, నిత్యా మీనన్ జంటగా తెరకెక్కిన అలా మొదలైంది సినిమాకి నందిని రెడ్డి డైరెక్టర్. దామోదర్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది. ఒకరకంగా చెప్పాలంటే నాని, నిత్యా మీనన్ సక్సెస్ ఫుల్ కరియర్ కి స్ట్రాంగెస్ట్ పిల్లర్ ఈ సినిమా సక్సెస్. సినిమాలో నటించిన ప్రతి ఒక్కరి న్యాచురల్ పర్ఫామెన్స్ ‘అలా మొదలైంది’ కి బిగ్గెస్ట్ ఎసెట్.

==============================================================================

కంత్రి

నటీ నటులు : NTR, హన్సిక మోత్వాని, తానీషా ముఖర్జీ

ఇతర నటీనటులు : ఆశిష్ విద్యార్థి, ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాస రావు, రఘు బాబు, ముకేష్ రిషి, ఆలీ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ

డైరెక్టర్ : మెహర్ రమేష్

ప్రొడ్యూసర్ : C. అశ్విని దత్

రిలీజ్ డేట్ : 9 మే 2008

NTR, హన్సిక మోత్వాని నటించిన యాక్షన్ థ్రిల్లర్ కంత్రి. స్టైలిష్ ఎంటర్ టైనర్స్ కి బ్రాండ్ అంబాసిడర్ మెహర్ రమేష్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాని అశ్విని దత్ నిర్మించారు.  పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో క్లైమాక్స్ కి కాస్త ముందుగా వచ్చే ట్విస్ట్ హైలెట్.

==============================================================================

భయ్యా

నటీనటులు : విశాల్, ప్రియమణి

ఇతర నటీనటులు : అజయ్, ఆశిష్ విద్యార్థి, దేవ రాజ్, ఊర్వశి, నిరోషా, పొన్నాంబలం

మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ

డైరెక్టర్ : భూపతి పాండ్యన్

ప్రొడ్యూసర్ : T. అజయ్ కుమార్

రిలీజ్ డేట్ : 28 సెప్టెంబర్ 2007

హీరో విశాల్ కి తమిళ నాట ఎంత ఫాలోయింగ్ ఉందో, తెలుగులోనూ అంతే ఫాలోయింగ్ ఉంది. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాని భూపతి పాండ్యన్ దర్శకత్వం వహించాడు. భయ్యా సినిమా తమిళంలో ‘మలాయ్ కొట్టాయ్’ గా రిలీజయింది. రెండు భాషలలోను సూపర్ హిట్టయింది.