ఏఎన్నార్ జయంతికి రాజుగారి గది-2 ట్రయిలర్

Monday,September 18,2017 - 12:40 by Z_CLU

నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల చేశారు. అది ఇనిస్టెంట్ గా హిట్ అయింది. మోషన్ పోస్టర్ కు మంచి పేరొచ్చింది. ఇప్పుడీ సినిమా ట్రయిలర్ లాంచ్ కు కూడా మరో స్పెషల్ డే లాక్ చేశారు. అదే ఏఎన్నార్ జయంతి. సెప్టెంబర్ 20న రాజుగారి గది-2 ట్రయిలర్ ను విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు.

నాగార్జున మెంటలిస్ట్ గా నటిస్తున్న ఈ సినిమాకు ఓంకార్ దర్శకుడు. సీరత్ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. కీలకపాత్రలో సమంత కనిపించనుంది. పీవీపీ సినిమా, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్, ఓక్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది.

అక్టోబర్ 13న రాజుగారి గది-2 సినిమాను విడుదల చేయాలని నిర్ణయించారు. ఇది సీక్వెల్ కాదనే విషయాన్ని నాగార్జున ఇప్పటికే స్పష్టంచేశాడు. రాజుగారి గది అనే టైటిల్ ను మాత్రమే వాడుకున్నామని, ఇంతకుముందొచ్చిన సినిమాకు, తాజా చిత్రానికి ఎలాంటి సంబంధం లేదంటున్నాడు. తమన్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.