సూపర్ స్టార్ తో మురుగదాస్ సినిమా ?

Saturday,June 16,2018 - 05:15 by Z_CLU

ప్రస్తుతం నో రెస్ట్ అంటూ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ ప్లాన్ చేస్తున్నాడు సూపర్ స్టార్ రజిని కాంత్.. ఈ క్రమంలోనే రజిని మురుగదాస్ కాంబినేషన్ లో సినిమా రాబోతుందంటూ  ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇటివలే రజినిను కలిసి మురుగదాస్ ఓ సోషల్ డ్రామా స్టోరీ వినిపించాడని, ఈ స్టోరీ కి రజిని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడని కోలీవుడ్ సమాచారం. ఇటివలే ‘కాలా’గా థియేటర్స్ లో ఎంట్రీ ఇచ్చిన రజిని ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత మురుగదాస్ తో సినిమా చేసే చాన్స్ ఉందనే టాక్ వినిపిస్తుంది.

ప్రస్తుతం విజయ్ తో ఓ సినిమా చేస్తున్న మురుగదాస్ ఆ సినిమా ఫినిష్ అవ్వగానే రజిని సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్  వర్క్ స్టార్ట్ చేస్తాడని తెలుస్తుంది. సో ప్రస్తుతానికి వార్తగానే ఉన్న ఈ క్రేజీ కాంబినేషన్ సినిమాపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉంది.