'సమ్మోహనం' పై మహేష్ ప్రశంసలు

Saturday,June 16,2018 - 04:50 by Z_CLU

 నిన్న విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది ‘సమ్మోహనం’.. లేటెస్ట్ గా ఈ సినిమాపై సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందించాడు. సోషల్ మీడియాలో సినిమా గురించి చెప్తూ టీంను అభినందించాడు. “సమ్మోహనం చిత్రాన్ని దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ చాలా అందంగా తీర్చిదిద్దారు. అద్భుతంగా డైరెక్ట్ చేశారు. మన పరిశ్రమలో అత్యద్భుతమైన టాలెంట్ ఉన్న దర్శకుల్లో ఆయన ఒకరు. సమ్మోహనం గురించి మాటల్లో చెప్పలేను. సింప్లీ ఐ లవ్ ఇట్”….

“సుధీర్‌బాబు, అదితిరావు హైదరీ తమ కెరీర్‌లోనే అత్యుత్తమ నటనను ప్రదర్శించారు. వారి కెరీర్‌లోనే ఉత్తమం అనడంలో ఎలాంటి సందేహం లేదు. సీనియర్ నటులు నరేష్ గారు ఫెర్ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఆయన  నటన బ్రిల్లియెంట్. మంచి సక్సెస్ సాధించిన చిత్ర యూనిట్‌కి  కంగ్రాట్స్” అని మహేష్‌బాబు ట్వీట్‌ చేశారు.