బ్యాక్ టు బ్యాక్ మూవీస్ ..సూపర్ స్టార్ సూపర్ ప్లాన్.

Sunday,June 03,2018 - 07:18 by Z_CLU

2.0 సినిమా రిలీజ్ ఆలస్యం అవుతుండడంతో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ ప్లాన్ చేస్తున్నాడు సూపర్ స్టార్. 2.0 సినిమా లాస్ట్ షెడ్యూల్ లో కాస్త గ్యాప్ తీసుకున్న రజిని ఆ గ్యాప్ లో ‘కాలా’ కరికులన్ సినిమాను సెట్స్ పై పెట్టి… ఫాస్ట్ ఫేజ్ లో షూటింగ్ ఫినిష్ చేసేసాడు. ఈ సినిమా మరో నాలుగు రోజుల్లో విడుదల కానుంది. అయితే జూన్ 7 నుండి కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్ లో రూపొందనున్న మరో సినిమాను సెట్స్ పైకి తీసుకు రాబోతున్నాడు సూపర్ స్టార్.

జూన్ 7 నుండి డెహ్రాడూన్ లో మొదటి షెడ్యూల్ జరపనున్న  యూనిట్ ఆ తర్వాత చెన్నైలో మరో షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. ఏదేమైనా సినిమా..సినిమాకు కాస్త ఎక్కువ గ్యాప్ తీసుకునే రజిని ఈ సారి బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో ఫాన్స్ ను ఎంటర్ టైన్ చేయడానికి రెడీ అవుతున్నాడు.