కార్తి 'చినబాబు' టీజర్

Sunday,June 03,2018 - 08:19 by Z_CLU

సూర్య, కార్తీ బ్రదర్స్ కాంబినేషన్ లో వస్తున్న  “చినబాబు” సినిమా టీజర్ విడుదలైంది. తమిళనాట 2డి ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై తమ్ముడు కార్తీ హీరోగా సూర్య నిర్మిస్తున్న “కుట్టి సింగం”ను తెలుగులో ద్వారకా క్రియేషన్స్ పతాకంపై “చినబాబు”గా విడుదల కానుంది.  రైతు కథతో రూపొందుతున్న ఈ సినిమా టీజర్ ప్రెజెంట్ సోషల్ మీడియాలో అందరినీ ఎట్రాక్ట్ చేస్తూ హంగామా చేస్తుంది. ముఖ్యంగా “పుట్టించే వాడు దేవుడైతే..పండించేవాడు దేవుడే… నువ్వు రైతు వైతే కాలర్ ఎగరేసి తిరుగంతే” అంటూ కార్తీ చెప్పిన డైలాగ్ సినిమాలో ఎమోషన్ ని తెలియజేస్తూ స్పెషల్ హైలైట్ గా నిలిచింది.