గ్రాండ్ గా ‘పేట’ ప్రీ రిలీజ్ ఈవెంట్

Wednesday,January 02,2019 - 04:55 by Z_CLU

రజినీకాంత్ ‘పేట’ హంగామా మరింత స్పీడందుకోనుంది. సంక్రాంతి బరిలో జనవరి 10 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమాకి భారీ స్థాయిలో ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ నెల 6 న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకోనున్నారు. ఈ ఈవెంట్ లో సినిమాకి సంబంధించి మరిన్ని డీటేల్స్ రివీల్ చేయనుంది ‘పేట’ టీమ్.

ఈ రోజు రిలీజైన ఈ సినిమా ట్రైలర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. రజినీకాంత్ ని మరింత స్టైలిష్ మాసివ్ అవతార్ లో ప్రెజెంట్ చేస్తున్నాడు దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్. భారీ స్టార్ కాస్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా, టాలీవుడ్ లో కూడా పాజిటివ్ బజ్ క్రియేట్ చేస్తుంది.

అనిరుద్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేశాడు. సినిమాలో రజినీకాంత్ సరసన త్రిష, సిమ్రాన్ హీరోయిన్ గా నటించారు. విజయ్ సేతుపతి, నవాజుద్దీన్ సిద్దీఖీ కీ రోల్స్ ప్లే చేశారు. వల్లభనేని అశోక్ ఈ సినిమా నిర్మాత.