Mr మజ్ను టీజర్ – ఇంతకీ అఖిల్ క్యారెక్టరేంటి...?

Wednesday,January 02,2019 - 06:35 by Z_CLU

రిలీజ్ కి ముందే కావాల్సినంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది Mr మజ్ను సినిమా. ఈ రోజు రిలీజైన టీజర్ సినిమాపై మరింత క్యూరియాసిటీ రేజ్ చేస్తుంది. ఈ సినిమా నుండి ఏ అప్డేట్ వచ్చినా స్టోరీలైన్ రివీల్ కాకుండా కేర్ తీసుకుంటున్న మేకర్స్, అఖిల్ క్యారెక్టర్ పై మాత్రం కంప్లీట్ ఫోకస్ ఫిక్స్ అయ్యేలా చేస్తున్నారు.

0:56 సెకన్ల టీజర్ లో ఓ వైపు మోస్ట్ క్రేజీయెస్ట్ కుర్రాడిలా కనిపిస్తూనే, ఇమోషనల్ గా కూడా కనెక్ట్ అవుతున్నాడు అఖిల్. దాంతో సినిమాలో ఎగ్జాక్ట్ గా అఖిల్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందా అనే క్యూరియాసిటీ ఫ్యాన్స్ లో క్రియేట్ అవుతుంది.

 “డీన్ ఇంట్లో, మార్గరెట్ రూమ్ లో రాత్రి 11:30 PM కి ఏం చేస్తున్నావ్..?’ అని బిగిన్ అయ్యే టీజర్, అఖిల్ ని ఎక్స్ పెక్ట్ చేసిన స్థాయిలో జోష్ ఫుల్ గా ప్రెజెంట్ చేస్తుంది. తమన్ BGM, లండన్ లొకేషన్స్ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతీది అవుట్ స్టాండింగ్. ఇక చివర్లో ప్రతి అమ్మాయికి ఓ లైఫ్ ఉంటుంది. I respect it…’ అని క్లోజ్ అయిన టీజర్, సినిమాలో జస్ట్ జోష్ ఒకటే కాదు, కావాల్సినంత ఇమోషన్ కూడా ఉండబోతుందని హింట్ ఇస్తుంది.

రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ ప్రమోషన్ ప్రాసెస్ స్పీడ్ పెంచిన మేకర్స్, సంక్రాంతికి ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. వెంకీ అట్లూరి డైరెక్షన్ లో తెరకెక్కుతుంది Mr మజ్ను. జనవరి 25 న రిలీజవుతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్. తమన్ మ్యూజిక్ కంపోజర్. B.V.S.N. ప్రసాద్ ఈ సినిమాకి ప్రొడ్యూసర్.