రజినీకాంత్ కొత్త సినిమా టైటిల్ ‘పేట’

Friday,December 21,2018 - 05:41 by Z_CLU

రీసెంట్ గా 2.0 సినిమాతో వరల్డ్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేసిన రజినీకాంత్ నెక్స్ట్ సినిమాతో మళ్ళీ అదే రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఆల్రెడీ షూటింగ్ కంప్లీట్ చేసుకుని రెడీ టు రిలీజ్ మోడ్ లో ఉన్న ఈ కొత్త సినిమాకి తెలుగు లో ‘పేట’ అనే టైటిల్ ఫిక్సయ్యారు మేకర్స్.

ఇప్పటికే తెలుగులో ఈ సినిమా నుండి ఒక సింగిల్ రిలీజ్ చేసి, ఆడియెన్స్ లో క్యూరియాసిటీ రేజ్ చేసిన మేకర్స్, వైడ్ రేంజ్లో సినిమాని ప్రమోట్ చేసే ఆలోచనలో ఉన్నారు. తమిళంలో ఈ సినిమాని సంక్రాతి కానుకగా రిలీజ్ చేస్తున్న టీమ్, తెలుగులో మాత్రం జనవరి సెకండాఫ్ లో లేదా, ఫిబ్రవరి ఫస్టాఫ్ లో సినిమాని రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. దీనికి సంబంధించి ఎగ్జాక్ట్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేయాల్సి ఉంది.

కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రజినీకాంత్ సరసన సిమ్రాన్, త్రిష హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాకి అనిరుద్ మ్యూజిక్ కంపోజర్.