సోషల్ మీడియా సెన్సేషన్ – ‘ఇంకేం ఇంకేం కావాలే’

Wednesday,January 02,2019 - 03:53 by Z_CLU

రిలీజై ఇన్ని రోజులు కావస్తున్నా ‘గీతగోవిందం’ హవా ఏ మాత్రం తగ్గడం లేదు. అందునా ‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే..’ సాంగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సాంగ్ జనంలో జస్ట్ క్రేజ్ ని క్రియేట్ చేయలేదు. మ్యూజిక్ లవర్స్ ని ఏకంగా ఎడిక్ట్ చేసేసింది. యూట్యూబ్ లో ఈ వీడియో సాంగ్ ఏకంగా 75 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది.

కొన్ని సాంగ్స్ రిలీజవ్వగానే ఎట్రాక్ట్ చేస్తాయి. ఓ వారం పది రోజులు, ఎక్కడ పడితే అక్కడ ఆ సాంగ్ వినిపిస్తూనే ఉంది. ఈ లోపు ఇంకో సాంగ్ రిలీజైతే, ఆటోమేటిక్ గా గ్రాఫ్ పడిపోతుంది. కానీ ‘ఇంకేం కావాలే..’ సాంగ్ వేరు. రిలీజైన కొత్తలోనే క్లాసిక్ మెలోడీ అనిపించుకుంది. ఇన్ని రోజులు గడుస్తున్నా, ఇప్పటికీ అదే గ్రాఫ్ ని మెయిన్ చేస్తుంది.

పరశురాం డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకి గోపీసుందర్ మ్యూజిక్ పెద్ద ఎసెట్ అయింది. రష్మిక, విజయ్ దేవరకొండ ల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ సినిమాకి మరో ప్రధాన ఆకర్షణ.