'సైరా నరసింహా రెడ్డి'...ఫస్ట్ లుక్ అప్పుడే

Thursday,June 07,2018 - 06:26 by Z_CLU

మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న మోస్ట్ ఎవైటింగ్ మూవీ ‘సైరా నరసింహ రెడ్డి’… శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబందించి చిరు పుట్టిన రోజు సందర్భంగా ఆగస్ట్ 22 న  ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇటివలే హైదరాబాద్ లో భారీ షెడ్యూల్ జరుపుకున్న ఈ సినిమా మరో షెడ్యూల్ కి రెడీ అవుతుంది. ఈ వారంలో మొదలు కానున్న ఈషెడ్యూల్ దాదాపు 40 రోజుల పాటు ఉంటుందని సమాచారం. ఈ షెడ్యూల్ లో కొన్ని పోరాట సన్నివేశాలు చిత్రీకరించనున్నారని తెలుస్తుంది.

కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో చిరు సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. అమితాబ్, జగపతి బాబు, సుదీప్, తమన్నా,విజయ్ సేతుపతి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే టైటిల్ మోషన్ పోస్టర్ తో అందరినీ ఎట్రాక్ట్ చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ తో ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో…