బాహుబలికి బై చెప్పిన రాజమౌళి

Friday,May 05,2017 - 11:48 by Z_CLU

దశలవారీగా ఒక్కో పని పూర్తిచేసుకుంటూ వచ్చిన రాజమౌళి ఎట్టకేలకు బాహుబలి ఫ్రాంచైజీ నుంచి బయటపడ్డాడు. తాజాగా ఈ సినిమాకు లండన్ లో ప్రచారం కల్పించిన రాజమౌళి.. ఈ ప్రమోషనల్ యాక్టివిటీతో తన పని పూర్తయిందని ప్రకటించాడు. ఈ మేరకు ఓ లవ్లీ పిక్ ట్విట్టర్ లో పెట్టిన జక్కన్న.. బాహుబలికి అఫీషియల్ గా బై చెప్పేశాడు.

బాహుబలి-2 విడుదలైన తర్వాత పెద్దగా ప్రచారం ఏమీ చేయలేదు. యూనిట్ లో దాదాపు అంతా రిలాక్స్ అయిపోయారు. ప్రభాస్ ఇప్పటికే అమెరికా చేరుకున్నాడు. రానా తన నెక్ట్స్ సినిమాలతో బిజీ అయిపోయాడు. తమన్న కూడా తమిళ ప్రాజెక్టులతో బిజీ. అయితే రాజమౌళి, అనుష్క మాత్రం రిలీజ్ తర్వాత కూడా ప్రచారాన్ని కొనసాగించారు. అలా సంగీత దర్శకుడు కీరవాణి, నిర్మాతతో కలిసి లండన్ వెెళ్లిన జక్కన్న.. అక్కడ కూడా ప్రచాారాన్ని ముగించాడు.

అఫీషియల్ గా బాహుబలి-2 ప్రాజెక్టుగా రాజమౌళి గుడ్ బై చెప్పేసినప్పటికీ టెక్నికల్ గా రాజమౌళి సేవలు ఇంకా అవసరమే. ఎందుకంటే త్వరలోనే జపాన్, రష్యా లాంటి దేశాల్లో బాహుబలి-2ను విడుదల చేయాలనుకుంటున్నారు. గతంలో పార్ట్-1 కోసం చేసినట్టు ప్రత్యేకంగా రీ-ఎడిట్ చేసి రిలీజ్ చేయాలనుకుంటే మాత్రం మరోసారి జక్కన్న సేవలు అవసరమౌతాయి.