BBC ఇంటర్వ్యూ - రాజమౌళి

Wednesday,May 03,2017 - 10:02 by Z_CLU

బాహుబలి వరల్డ్ వైడ్ ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉంది బాహుబలి & టీమ్. అయితే నిన్న జరిగిన BBC ఇంటర్వ్యూలో చాలా విషయాలు మాట్లాడాడు దర్శక బాహుబలి రాజమౌళి. ఆ విషయాలు ఆయన మాటల్లోనే…

ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ బాలీవుడ్ సినిమా నిన్నా మొన్నటి వరకు… కానీ బాహుబలి సినిమాతో ఇండియాలో తెలుగు సినిమా కూడా ఉందని తెలిసింది. ఇండియాలో ఏ పార్ట్ లో తెలుగు మాట్లాడతారు..? ఈ ఇండస్ట్రీ గురించి చెప్పండి.

ఇండియాలో చాలా భాషల్లో మాట్లాడతారు, తెలుగు తమిళం, మలయాళం, కన్నడ. ఇవి జస్ట్ ఒక్క సౌత్ ఇండియాలో మాట్లాడే భాషలు. తెలుగు ఇండియన్ లాంగ్వేజెస్ లో ఒకటి.

ఇప్పటి వరకు వరల్డ్ క్లాసిక్ సినిమాల అకౌంట్ లో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు…

గుర్తింపు రాకపోవడం అనేది కొంచెం దురదృష్టకరమే. తెలుగులోనూ అద్భుతమైన సినిమాలున్నాయి. ఇంకా వస్తాయి. ఇక గుర్తింపు అంటారా…? తప్పకుండా దొరుకుతుంది.

ఒక సినిమా చేద్దామనుకున్నప్పుడు ఏం టార్గెట్ పెట్టుకుంటారు..?

స్టోరీ టార్గెట్ పెట్టుకుంటాను. అందులో పవర్ ఫుల్ క్యారెక్టర్స్ పెట్టుకుంటాను. వాటిని బెస్ట్ లెవెల్ లో ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటాను… అంతే అంతకు మించి ఏమీ ఆలోచించను.

బాహుబలి తరవాత చిన్న సినిమా చేస్తారా..? పెద్ద సినిమా చేస్తారా..?

చిన్న సినిమా..? పెద్ద సినిమా కాదు.. ఏ స్టోరి ఇన్స్ పైర్ చేస్తే ఆ సినిమా చేస్తాను. స్టోరీని బట్టి కాన్వాస్ ఉంటుంది. అంతేకానీ పెద్ద సినిమా.. చిన్న సినిమా అని పర్టికులర్ క్యాటగిరీస్ ఉండవు. జస్ట్ స్టోరీ మ్యాటర్స్.

బాహుబలి గురించి చెప్పండి..? ఈ ఫీవర్ ఎప్పట్లో తగ్గుతుంది…?   

బాహుబలి ఫీవర్ గురించి చెప్పాలంటే.. ప్రస్తుతానికి బాహుబలి సినిమా ఒక్కటే రిలీజయింది. ఇంకా చాలా ప్లాన్స్ ఉన్నాయి. రీసెంట్ గా ‘The Rise Of Shivagami’ అని బుక్ రిలీజ్ చేశాం. అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. వెబ్ సిరీస్ కూడా ప్లాన్ చేస్తున్నాం…. ఆనిమేషన్ ప్లాన్ చేస్తున్నాం. ఇంకా చాలా ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి.

రజినీకాంత్ తో సినిమా ఎప్పుడు..?

రజినీకాంత్ గారితో సినిమా చేయాలనేది ప్రతి ఇండియన్ ఫిలిం మేకర్ డ్రీమ్. నాకు అలాంటి అవకాశం దొరికితే అసలు వదులుకోను. ఆ అవకాశం స్టోరీ కల్పించాలి. ఈ కథ ఆయనకోసమే అనేంతలా ఇన్స్ పైర్ చేయాలి. అలాంటి స్టోరీ దొరికినపుడు తప్పకుండా చేస్తాను.

ఈ సినిమా వయోలెన్స్ విషయంలో సెన్సార్ ఎంతవరకు కంట్రోల్ చేసింది…?

సెన్సార్ ఎప్పుడూ ఉంటుంది. వయోలెన్స్ అనేది అతిగా ఉన్నా ఎబ్బెట్టుగానే ఉంటుంది. సెన్సార్ కండిషన్స్ ఉన్నా నాకు తెలిసి ఏ ఫిలిం మేకర్ కూడా సెన్సార్ ని మైండ్ లో పెట్టుకుని తనను తాను కంట్రోల్ చేసుకోడు. కాంప్రమైజ్ అయి సినిమా చేయడు. అందరిలాగే నా విజన్ ని నేను ఎగ్జాక్ట్ గా ఎగ్జిక్యూట్ చేస్తాను. బాహుబలి విషయంలోనూ అదే జరిగింది.

ఫ్యూచర్ లో హాలీవుడ్ సినిమాలు చేసే చాన్సెస్ ఏమైనా ఉన్నాయా..?

హాలీవుడ్ సినిమాలు వేరు. నా స్టోరీస్ వాటి విజన్ వేరు. హాలీవుడ్ సినిమా చేసేయాలని నా స్టోరీస్ మార్చుకోలేను. నా స్టోరీస్.. నా విజన్ హాలీవుడ్ లోను వర్కవుట్ అవుతుందనుకుంటే డెఫ్ఫినేట్ గా చేస్తాను. కావు అనుకున్నప్పుడు ఆ ఆలోచనను కూడా దగ్గరికి రానివ్వను.

అనుష్కతో పని చేయడం ఎలా అనిపించింది..?

వండర్ ఫుల్ ఆక్ట్రెస్. క్లోజ్ ఫ్రెండ్. నా కరియర్ లో ఓకె హీరోయిన్ తో రెండు సార్లు పని చేసింది ఒక్క అనుష్కతోనే.

మీ ఫ్యూచర్ సినిమాల్లో కట్టప్ప లాంటి క్యారెక్టర్ మళ్ళీ ప్లాన్ చేస్తారా..?

కట్టప్ప లాంటి క్యారెక్టర్ అంటే ఏమే చెప్పలేను. కానీ డెఫ్ఫినేట్ గా అంత డెప్త్ , లైఫ్ ఉన్న క్యారెక్టర్స్ మాత్రం నేను చేసే ప్రతి సినిమాలో ఉంటాయి. ఆ విషయంలో తగ్గేది లేదు.

బాహుబలి సక్సెస్ గురించి చెప్పండి.

ఐదేళ్ళు చాలా కష్టపడ్డాం. ఆ కష్టానికి ప్రతిఫలం ఇచ్చింది మాత్రం ఫ్యాన్సే. ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయి ఇన్నాళ్ళు గడుస్తున్నా, ప్రతి సిచ్యువేషన్ ని, క్యారెక్టర్ ని అంతలా గుర్తు పెట్టుకుని, ఆ బజ్ ని రెండేళ్ళ పాటు అలాగే అలైవ్ గా ఉంచారు. ఈ రోజు ఇంత పెద్ద సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నామంటే అది ఫ్యాన్స్ వల్లే. థాంక్ యూ సో మచ్.