రాధ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ డీటెయిల్స్

Friday,May 05,2017 - 12:47 by Z_CLU

వరుస విజయాలతో దూసుకుపోతున్న శర్వానంద్.. ఇప్పుడు రాధ సినిమాతో రెడీ అయ్యాడు. ఫస్ట్ టైం పోలీస్ గెటప్ లో శర్వ కనిపిస్తున్న సినిమా ఇది. ప్ర‌ముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్ర‌సాద్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై చంద్ర‌మోహ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెరకెక్కింది. రేపు విజయవాడలో ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ జరగనుంది.

శర్వానంద్, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. మరోవైపు పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాను మే 12న థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. రథన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

ఈ ఇయర్ శతమానంభవతి సినిమాతో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు శర్వానంద్. ఇప్పుడు మరో సరికొత్త గెటప్ తో రాధగా తెరపైకి దూసుకొస్తున్నాడు.