రాజమౌళి, మహేష్ దృష్టిలో చిట్టిబాబు

Saturday,April 07,2018 - 03:08 by Z_CLU

భారీ వసూళ్లతో దూసుకుపోతోంది రంగస్థలం సినిమా. టాలీవుడ్ కు చెందిన ప్రముఖులంతా ఒక్కొక్కరుగా ఈ సినిమాను మెచ్చుకుంటున్నారు. తాజాగా ఈ లిస్ట్ లోకి దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు చేరారు.

సినిమా చాలా ఇంటెన్స్ గా ఉందన్న మహేష్.. సుకుమార్ ను మాస్టర్ ఆఫ్ ఆర్ట్ అంటూ మెచ్చుకున్నాడు. రామ్ చరణ్, సమంత తమ కెరీర్లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారని ట్వీట్ చేశాడు. అలాగే మైత్రీ మూవీ మేకర్స్ మరోసారి మంచి చిత్రాన్ని నిర్మించారని పొగిడాడు

అటు దర్శకుడు రాజమౌళి కూడా రంగస్థలం సినిమాను మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. మరీ ముఖ్యంగా చిట్టిబాబు పాత్రలో చరణ్, దర్శకుడిగా సుకుమార్ పడిన కష్టాన్ని అభినందించాడు. సూపర్బ్, వెల్ డన్ అంటూ ట్వీట్ చేశాడు.