బాలీవుడ్ ‘క్వీన్’ తెలుగు రీమేక్ లాంచ్ డేట్ ఫిక్సయింది

Saturday,September 30,2017 - 04:34 by Z_CLU

బాలీవుడ్ సెన్సేషనల్ హిట్ ‘క్వీన్’ తెలుగులో రీమేక్ కానుందనే న్యూస్ గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కంగనా రనౌత్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని తెలుగు, తమిళ, కన్నడ, భాషలతో పాటు తెలుగులోనూ రీమేక్ కానుంది అయితే  ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా అక్టోబర్ 25 న లాంచ్ గ్రాండ్ గా కానుంది. ఈ సినిమాలో తమన్నా  లీడ్ రోల్ ప్లే చేయనుంది.

2013 లో రిలీజై సెన్సేషన్ క్రియేట్ చేసిన బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘క్వీన్’ తెలుగులోనూ అదే రేంజ్ సక్సెస్ ని అచీవ్ చేస్తుందని కాన్ఫిడెంట్ గా ఉంది తమన్నా. అయితే నిన్నా, మొన్నటి వరకు  ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటించనుందనే టాక్ గట్టిగా వినిపించినా, కాజల్ ఒక్క తమిళ వర్షన్ లో నటిస్తుండగా, తెలుగులో తమన్నా నటిస్తుండటం విశేషం.

గతంలో భూమిక లీడ్ రోల్ ప్లే చేసిన ‘మిస్సమ్మ’ సినిమాకు దర్శకత్వం వహించిన ‘నీలకంఠ’ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు. మను కుమారన్ నిర్మించనున్న ఈ సినిమాకు సంబంధించి తక్కిన ఇన్ఫర్మేషన్ ఇంకా అనౌన్స్ చేయాల్సి ఉంది.